పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న బట్టలు ఎక్కడివో తెలుసా..? వాటి ప్రత్యేకత ఏంటంటే..?
రికార్డ్ ల మోత మోగిస్తోన్న పుష్ప2లో ఎన్నో ప్రత్యేకతలుఉన్నాయి. అయితే ఈసినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ ఫ్యాంట్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. మరి ఈ బట్టలు ఎక్కడ డిజైన్ చేశారు..? వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
భారీ కలెక్షన్స తో దుమ్మురేపుతోంది పుష్ప2 మూవీ. నిజంగా తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోతోంది. రికార్డ్ లు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ ను వణికిస్తుంది పుప్ప2 సినిమా. ఈసినిమాలో చాలా ప్రత్యేకలు ఉన్నాయి. ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయి. పుష్ప2 లో బన్నీ పెర్ఫామెన్స్ అంతా ఒక ఎత్తు అయితే.. మిగిలినవననీ ఒక ఎత్తు. మరీ ముఖ్యంగా బన్నీ మ్యానరిజమ్.. స్టైల్, ఆయన యాస, అల్లు అర్జున్ వేసుకున్న బట్టలు కూడా చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
అయితే ఇంత స్పెషల్ గా కనిపిస్తున్న ఈ బట్టలు ఎవరు డిజైన్ చేశారు. ఎక్కడ నుంచి తీసుకు వచ్చారు అనేది చాలా మంది అనుమానం. పుష్ప2 లో పుష్ప రాజ్ బట్టలు మెరుస్తూ... ఉంటాయి. ఈ కథ 80 లలో జరిగినదిగా చూపించారు కాబట్టి అప్పటి స్టైల్ ను చూపించారు. అయితే ఈ బట్టలు పోచంపల్లిలో స్పెషల్ గా తయారు చేశారట.
అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ ను సీకో పట్టు అంటారట. ఇవి పోచం పల్లి స్పెషల్ గా చెప్పుకుంటారు. బన్నీ వేసుకున్న చొక్కాలలో ఇక్కత్ సీకో పట్టు కూడా ఉన్నాయి. అయితే ఇవి ఇప్పుడు పోచంపల్లి స్పెషల్ గా మార్కెట్ లో లభిస్తున్నాయి.
ఇక ఈ బట్టలను పోచంపల్లిమార్కెట్ లో ప్రత్యేకంగా కుట్టించార. పుష్ప 2 సినిమా షూటింగ్ పోచంపల్లిలో కూడా కొన్నిరోజులు జరిగిందట. ఇక అక్కడ ఉన్నప్పుడు ప్రత్యేకంగా వీటిని చేయించారని కూడా చెపుతున్నారు. సినిమా మొత్తం మీద ఇవి ప్రత్యేకంగా నిలవడానికి బన్నీ వాటినివేసుకోవడం ఒక కారణం అయితే.. అవి వేసుకుని వాటికి తగ్గట్టుగా పాత్రను అద్భుతంగా పోషించడం మరో హైలెట్.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పుష్పరాజ్
ఇక పుష్పరాజ్ బాక్సాఫీస్ మీద విజృంభిస్తున్నాడు. సినిమా హాళ్ళు వీకెండ్.. వీక్ డేస్ అని లేకుండా హౌస్ ఫుల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు హిందీలో భారీగా వసూళ్ళు చేస్తున్నాడు పుష్ప. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు 900 కోట్లకు పైగా కొల్లగొట్టాడు అల్లు అర్జున్. అటు ఓవర్ సిస్ లో కూడా వసూళ్ల ప్రభంజనం కనిపిస్తోంది.
ఎక్కడ చూసినా పుష్ప2కు జననీరాజనం పలుకుతున్నారు. టాప్ సినిమాల కలెక్షన్ మార్క్ లను దాటుతూ.. రికార్డ్స్ ను తమ ఖాతాల్లో వేసుకుంటుంది పుష్ప2.ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ కల్కీ సినిమా వారం రోజులు దాటిన తరువాత సాధించిన 500 కోట్ల మార్క్ ను పుష్పరాజ్ 2 రోజుల్లోనే సాధించాడు.
హిందీలోనే ఎక్కువ.
పుష్ప 2 సినిమాకు సౌత్ లో కంటే హిందీలోనే ఎక్కువ ఆధరణ లభిస్తోంది. తెలుగులోకంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి పుష్పరాజ్ కు . హిందీ బెల్ట్ లో నాలుగు రోజులకు 300 కోట్లకుపైగా వసూళ్లు లభించినట్టు తెలుస్తోంది. హిందీలో ఇప్పటికీ పుష్ప సినిమా కోసం థియేటర్ల దగ్గర జాతర జరుగుతోంది.
మరీ ముఖ్యంగా యూపీ బీహార్ లో అల్లు అర్జున్ ప్యాన్స్ విజృంభిస్తున్నారు. ప్రత్యేకంగా స్క్రీన్స్ బుక్ చేసుకుని మరీ ఫ్యామిలీలతో సహా సినిమాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం పుష్ప మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పుష్పరాజ్ దండయాత్రకు భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తెలుగు తరువాత బన్నీకి పట్టు ఉన్న మలయాళంలో మాత్రం ఈసినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. మొదటి రోజు నుంచే పెద్దగా కలెక్షన్లు రావడంలేదని తెలుస్తోంది. మరి అక్కడి అభిమానులకు ఈసినిమా ఎందుకు నచ్చలేదు అనేది తెలియదు.