రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు..? రహస్య ప్రేమ వెనుక నిజానిజాలు..?
ఇప్పటికే చాలాసార్ల దొరికిపోయారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా. ఇక పెళ్ళే తరువాయి అంటున్నారు ఫ్యాన్స్. మరి ముహూర్తం ఎప్పుడు..? ప్రకట చేసేదిఎప్పుడు..?
రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ప్రత్యక్షం అయ్యింది రష్మిక మందన్న. ఇక అంతో ఇంతో డౌట్ ఉన్నవారికి కూడా ఈ విజ్యూవల్ తో క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే వదినమ్మ అని ముందు నుంచే పిలుస్తున్నారు రష్మికను. ఇక తాజాగా విజయ్ ఫ్యామిలీతో కలిసి పుష్ప సినిమా చూసింది రష్మిక.
Also Read: పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న బట్టలు ఎక్కడివో తెలుసా..? వాటి ప్రత్యేకత ఏంటంటే..?
ఇక దాంతో అంతా ఒకే పెళ్ళెప్పుడు అని అడిగేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇంకా అంత వయసేమయిపోయింది..ముందు ముందు మంచిముహూర్తం చూసి చేసుకుంటారులే అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలేంటి ఈ గోల. విజయ్ అనౌన్స్ చేసేదాకా ఆగరా..? అందులో నిజానిజాలు ఏంటి అనేది చూడరా..? అంటే.. ఇంకే చూడాలి కలిసి తిరుగుతన్నారు.
మాల్దీవ్స్ , ముంబయ్ రెస్టారెంట్స్.. ఇలా వారు తిగని ప్లేస్ లు లేవు. కలిసి ఫోటోలు దిగకపోయినా.. ఒకే టైమ్ కు.. ఇద్దరు ఒకే లోకేషన్స్ లో విడివిడిగా ఫోటోస్ పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇవి కాకుండా మరో సందర్భంలో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ నుంచి తీసుకున్న ఒకే కలర్ డ్రెస్ ను ఇద్దరు వేసుకోవడం.
విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలను రష్మిక ప్రమోట్ చేయడం. ప్రమోషనల్ ఈవెంట్స్ కు వచ్చి ఆనంద్ తో క్లోజ్ గా మూవ్ అవ్వడం. ఈ ఈవెంట్స్ లో వదినమ్మ అని ఆడియన్స్ అరుస్తున్నా కాస్త కూడా స్పందిచకపోవడం విచిత్రం.
సరే స్పందించకపోయినా.. అదేం లేదు సోషల్ మీడియాలో జరిగేదంటా ఫేక్ న్యూస్.. అంతా గాసిప్స్.. మామధ్య ఏంలేదు అని ఓ స్టెట్మెంట్ అయిన ఇవ్వలేదు ఇద్దరు. దాంతో ఇప్పుడు జనాలంతా ఇక వీళ్లుద్దరు మధ్య ఏదో ఉంది అని అనుకోవడం కాదు.. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. ఇక పెళ్ళే తరువాయి అంటున్నారు.
దాంతో విజయ్ దేవరకొండ - రష్మికల పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఫ్యాన్స్. కొంత మంది మాత్రం వీళ్ళది ప్రేమే అనడం కరెక్ట్ కాదని.. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారడంలో తప్పులేదు కదా.. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ప్రేమికులు అయిపోతారా అని అంటున్నారు. అలాంటప్పుడు మే బెస్ట్ ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అని ఇంకొదరి ప్రశ్న.
ఏది ఏమైనా.. వీరి పెప్రేమ నిజం అయితే.. పెళ్ళి మాత్రం ఇప్పట్లో ఉండదనే తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ లేదు. వరుస ఫెయిల్యూర్స్ తో ఆయన ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. గతంలో రౌడీ హీరో మ్యానియా నడిచింది. పూనకాలతో ఊగిపోయారు జనాలు. లేడీ ఫ్యాన్స్ అయితే విజయ్ లేకపోతే బ్రతకలేమన్నట్టుగా అభిమానించారు.
అయితే ఈ మధ్యలో అసలు విజయ్ దేవరకొండ పేరే వినిపించడంలేదు. బయట ఈవెంట్ లో కనిపిస్తే మాత్రం విజయ్ క్రేజ్ తెలుస్తుంది. కాని సినిమాల పరంగా ఆయన సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నాడు… ఆ తర్వాత సంక్రాంతి నుంచి మైత్రీ వాళ్ల సినిమా ఉంటుంది.. ఆ తర్వాత దిల్ రాజు సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాలు రిజల్ట్ ను బట్టి విజయ్ నెక్ట్స్ ప్లాన్ ఉంటుంది. ఇక రష్మి క డిమాండ్ ఎప్పటిప్పుడు పెరిగిపోతోంది.
వరుస సినిమాలదో దూసుకుపోతోంది. పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్ తో రష్మిక బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ అందుకోబోతోంది. టాలీవుడ్ లో కూడా బిజీ కాబోతోంది. దాంతో ఆమె ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే కెరీర్ కు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. దాంతో ఇప్పట్లో వీళ్ళ పెళ్ళి ప్రస్తావన వచ్చే అవకాశం లేదు అనే చెప్పాలి. ఒక వేళ్ల ప్రేమ లాంటిది లేదు అనుకున్నా.. విడి విడిగా పెళ్ళిళ్లు చేసుకున్నా.. వీరి పెళ్లికి ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది.