- Home
- Entertainment
- Prabhas, Bunny sentiment: ప్రభాస్, అల్లు అర్జున్ ఉగాది సెంటిమెంట్, ఈసారి పండక్కి ఏం చేయబోతున్నారో తెలుసా?
Prabhas, Bunny sentiment: ప్రభాస్, అల్లు అర్జున్ ఉగాది సెంటిమెంట్, ఈసారి పండక్కి ఏం చేయబోతున్నారో తెలుసా?
Prabhas, Allu Arjun, Ugadi sentiment: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్. ఏ పని చేసినా..సెంటిమెంట్ ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఇక ఈసారి పండగసెంటిమెంటన్ ను ఇద్దరు స్టార్ హీరోలు ప్రభాస్, బన్నీలు ఇద్దరు ఒకేసారి ఫాలో అవ్వబోతున్నారట.

Prabhas, Allu Arjun, Ugadi sentiment: సినిమాపరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. కొంత మంది నాస్తికులు తప్పించి.. దేవుడిని నమ్మి..పూజతో సినిమాలు స్టార్ట్ చేసే ప్రతీ ఒక్కరూ..కాస్త సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఎక్జాంపుల్ చెప్పాలంటే మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ కు తాను వెళ్ళడు.
వెళ్తే ఆసినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతాడు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరో మొదలు కుని చిన్న హీరోల వరకూచాలామంది స్టార్లు సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇక తాజాగా బన్నీ ప్రభాస్ కూడా పండగ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట.
ఫెస్టివల్ రోజు తమ సినిమాలు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే..? పుష్ప,పుష్ప2 తో అల్లు అర్జున్ ఎంత క్రేజ్ సంపాదించడో అందరికి తెలుసు. పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారిపోయాడు నార్త్ లో మనోడికి ఫ్యాన్స్ భయంకరంగా పెరిగిపోయారు.
ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో కూడా పుష్పరాజ్ గెటప్ తో చాలామంది అలరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే..పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాట వల్ల అల్లు అర్జున్ ఎదుర్కొన్న కేసు, జైలుకెళ్లడం.. ఇలా ఈసినిమా సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అల్లు అర్జున్ పరిస్థితి.
Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
దాంతో పుష్ప3 అనౌన్స్ చేసినా కాని..ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో లేడట అల్లు అర్జున్. ఇప్పటికే పుష్పరాజ్ లుక్ నుంచి కూడా బయటకు వచ్చి.. న్యూలుక్ లో దర్శనం ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాదాపు ఐదారేళ్లు పుష్ప సినిమాల కోసమే కేటాయించాడు. దాంతో ఛేంజ్ కోసం మధ్యలో త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడట. అయితే ఈసినిమా ఓపెనింగ్ త్వరలో ఉండబోతోంది.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
అది కూడా వచ్చే నెల ఉగాది సందర్బంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అవుతందని సమాచారం. పండట పూట శుభప్రదంగా సినిమా స్టార్ట్ చేయబోతున్నారట టీమ్. ఎటువంటి ఆటంకాలు లేకుండా.. ఇలా సెంటిమెంట్ గా ఉగాది రోజు ఓపెనింగ్ చేయబోతున్నారట. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసిన తరువాత అల్లు అర్జున్ పుష్ప3 లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మధ్యలో సందీప్ రెడ్డితో కూడా అల్లు అర్జున్ సినిమా కమిట్ అయ్యాడు.
spirit telugu movie budget is 500 crores prabhas sandeep reddy vanga
ఈసినిమా ఎప్పుడు చేస్తారు అనేది ప్రభాస్ మూవీని బట్టి ఉంటుంది. మధ్యలో ప్రభాస్ మూవీ ఎందుకు వచ్చిందంటే.. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా ఉగాదిరోజే స్టార్ట్ చేయబోతున్నారట. ప్రభాస్ కూడా ఉగాది సెంటిమెంట్ తో అదే రోజు స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి.
Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఇక సందీప్ రెడ్డికి కూడా ప్రభాస్ టైమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అటు ప్రభాస్ తో సందీప్ రెడ్డి ఉగాది రోజుల స్పిరిట్ స్టార్ట్ చేస్తాడు.. ఇటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ చేస్తాడు. ప్రభాస్ సినిమా అయిపోయినదాన్ని బట్టి సందీప్ అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అల్లు అర్జున్ పుష్ప3 షూట్ లో జాయిన్ అవుతాడని సమాచారం. మోత్తానికి ఇద్దరు హీరోలు ఉగాది రోజు తమ సినిమాలను స్టార్ట్ చేయబోతున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.