బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
బాబాయ్ బాలకృష్ణ.. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్. తండ్రీ కొడుకులు ఇద్దరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా. ఆ హీరోయిన్లు బాలయ్యకు హిట్ ఇచ్చారా.. తారక్ కు హిట్ ఇచ్చారా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల పక్కన నటించడానికి హీరోయిన్లకు వయస్సు తేడాను అస్సలు పట్టించుకోరు అంతే కాదు తండ్రి తో నటించిన హీరోయిన్ తో కోడుకు రొమాన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఫార్ముల ఈ జనరేషన్ లో కూడా నటుస్తోంది. నాగచైతన్య హీరోయిన్ తో నాగార్జున, ఎన్టీఆర్ హీరోయిన్లతో బాలయ్య.. ఇలా తండ్రీ కొడుకులు ఒకే హీరోయిన్ లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరితో స్టెప్పులేసిన బ్యూటీస్ ఎవరో తెలుసా..?
Also Read: 18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?
బాలకృష్ణ - ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లలో ముందు కాజల్ అగర్వాల్ ను గురించి చెప్పుకోవాలి. ఇక్కడ వచిత్రం ఏంటంటే.. కొడుకులు నటించిన తరువాతే తండ్రులు ఆ హీరోయిన్లతో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసింది. బృందావనం, బాద్ షా , టెంపర్ ఈమూడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ హిట్ గా నిలిచింది.
ఇక బాలయ్య కాజల్ కాంబినేషన్ లో సినిమాలు రాలేదని ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. అదే టైమ్ లో బాలకృష్ణతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ తోలిసారిగా బాలయ్య సరసన నటించి మెప్పించింది. హీరోయిన్లు చాలా వరకూ అంతే.. కాస్త ఏజ్ బార్ అయితే సీనియర్ హీరోల సరసన చేరిపోవాల్సిందే. ప్రస్తుతం కాజల్, నయనతార, తమన్నా లాంటి వారి పరిస్థితి ఇంతే ఉంది.
Also Read: 1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Adhurs Movie
ఇక తారక్ తో తక్కువ సినిమాలు చేసి... బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా. ఆమె ఎవరో కాదు నయనతార. కాజల్ అయితే తారక్ తో మూడు సినిమాలు చేసి... బాలయ్యతో ఒక్క సినిమా చేసింది. కాని నయనతార మాత్రం బాలయ్యతో మూడు సినిమాలు చేసి.. ఎన్టీఆర్ తో ఒక్క సినిమా మాత్రమే చేసింది. తారక్, నయనతార కాంబినేషన్ లో వినాయక్ డైరెక్ట్ చేసిన అదుర్స్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జనాలను కడుపుబ్బా నవ్వించింది.
Also Read: 1600 కోట్లు వసూళ్ళు కేవలం 3 సినిమాలతోనే సాధించిన హీరోయిన్?
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేసిన నయనతార బాలయ్యతో మూడు సినిమాలు చేసింది. బాలకృష్ణ , నయనతార కాంబినేషన్ లో సింహ, జైసింహ, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడు సినిమాలు చేయగా..మూడు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సింహా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Also Read:300 మందితో ఎఫైర్, హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపిన స్టార్
ఇక ఎన్టీఆర్ బాలయ్యతో నటించిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్ తో ఈ బ్యూటీ నాన్నకు ప్రేమతో సినిమాలో నటించి మెప్పించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వగా.. బాలయ్యబాబుతో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బాలయ్యతో ఓ గెస్ట్ పాత్రలో ఓ పాటలో కనిపించింది.
ఎన్టీఆర్ బయెపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్, ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించి మెప్పించారు. ఇలా బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి సినిమాల్లో ఈ బాబాయ్ అబ్బాయితో ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేశారు.