Pooja Hegde: సూర్య 'రెట్రో' కోసం మొదటిసారి ఆ పని చేయబోతున్న పూజా హెగ్డే.. థియేటర్లో సర్‌ప్రైజ్
Pooja Hegde: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న `రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకి ఆమె ఏం చేయబోతుందో తెలుసా?

Retro, Pooja Hegde
Pooja Hegde: `కంగువా` సినిమా తర్వాత సూర్య నటిస్తున్న మూవీ `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

రెట్రో సూర్య
శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా. జాకీ, మాయపాండి ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా మేడే స్పెషల్‌గా మే 1న విడుదల కానుంది. ఈ సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‌లో మొదటిసారి ఆ పని చేయబోతుంది పూజా.
రెట్రో మూవీ కోసం డబ్బింగ్ చెప్పిన పూజా హెగ్డే
`రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఆమె తమిళంలో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. ఆమె ప్రయత్నానికి ప్రశంసలు వస్తున్నాయి.
పూజా హెగ్డే రాబోయే సినిమాలు
`రెట్రో` తర్వాత పూజా హెగ్డేకు తమిళంలో మూడు సినిమాలు ఉన్నాయి. `కూలీ` సినిమాలో ఒక పాటలో స్టెప్పులేసింది. విజయ్ సరసన `జననాయగన్` సినిమాలో నటిస్తోంది. ఇలా మళ్లీ కెరీర్ పరంగా స్పీడ్ పెంచింది పూజా. కానీ తెలుగులో ఇంకా మరే మూవీకి ఒప్పుకోలేదు.
read more: Bigg Boss Telugu 9 Host: విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే