Bigg Boss Telugu 9 Host: విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే
Bigg Boss Telugu 9 Host: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి విజయ్ దేవరకొండ హోస్ట్ అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నిజం ఏంటి? అనేది తెలిసింది.

Bigg Boss Telugu 9 update
బిగ్ బాస్ షో.. రియాలిటీ షోస్‌లో అత్యంత ఆదరణ పొందే, అత్యంత పాపలర్ షో ఇదే. దీనిపై చాలా చర్చ నడుస్తుంటుంది. చాలా వివాదాలు కూడా ఉన్నాయి. ఏ వివాదాలున్నా విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. అయితే కొన్ని సీజన్స్ లో ఇది బాగా సక్సెస్ అయ్యింది. కొన్ని సీన్లలో డల్ అయ్యింది. మరికొన్ని సార్లు యావరేజ్‌గా నడిచింది.

Bigg Boss Telugu 9 update
గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 యావరేజ్‌గా ఆదరణ పొందింది. ప్రారంభంలో డల్‌గా ఉన్నా. చివర్లో పుంజుకుంది. ఆద్యంతం ఆకట్టుకుంది. గత సీజన్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి.
దీనికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. అందులో భాగంగా 9వ సీజన్‌కి హోస్ట్ గా నాగార్జున తప్పుకుంటున్నాడని, మరో సెలబ్రిటీ హోస్ట్ వస్తారని తెలుస్తుంది.
Bigg Boss Telugu 9 update
నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా షోకి అంతగా ఊపు తేలేకపోతున్నాడని, రేటింగ్ పడిపోతుందనే రూమర్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్‌కి హోస్ట్ ని మారుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు 9కి కొత్త హోస్ట్ వస్తారని అన్నారు.
నాగార్జున స్థానంలో విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. రౌడీ బాయ్ ఈ సీజన్ హోస్ట్ గా చేస్తారని అంటున్నారు. అందుకు విజయ్‌కి భారీగానే పారితోషికం ఇస్తున్నారని, అంతేకాదు బిగ్ బాస్ టీమ్‌కి విజయ్ కూడా కండీషన్లు పెడుతున్నాడంటూ రూమర్లు వినిపించాయి.
Bigg Boss Telugu 9 update
ఈ నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ షోకి విజయ్ దేవరకొండ హోస్ట్ అనే రూమర్ లో నిజం లేదని తెలుస్తుంది. ఆయన హోస్ట్ గా చేయడం లేదట. విజయ్ టీమ్ కూడా ఈ ఇదే విషయాన్ని చెబుతుంది.
ఆయన్ని బిగ్ బాస్ కోసం ఎవరూ అప్రోచ్ కాలేదని, విజయ్ ఈ షో చేయడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇవన్నీ రూమర్స్ గానే తెలిపింది. దీంతో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి హోస్ట్ గా చేసే ఛాన్స్ లేదని అర్థమవుతుంది.
Bigg Boss Telugu 9 update
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 హోస్ట్ గా నాగ్ తప్పుకుంటున్నారనే రూమర్‌లోనూ నిజం లేదట. ఎందుకంటే పది సీజన్ల వరకు నాగ్ హోస్ట్ అనేది డిస్నీ హాట్ స్టార్ వాళ్లతో అగ్రిమెంట్ ఉంది. కాబట్టి ఆయన తప్పుకునే ఛాన్స్ లేదని, ఆయన్ని తప్పించే ఛాన్స్ కూడా లేదని తెలుస్తుంది.
మరి ఇందులో ఏది నిజమనేది మున్ముందు క్లారిటీ వస్తుంది. అయితే ఈ సారి మేలోనే షో ప్రారంభమవుతుందనే రూమర్ కూడా వినిపిస్తుంది. అందులోనూ నిజం లేదని సమాచారం. రెగ్యూటర్ టైమ్‌కే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట.
also read: Bhanumathi Serial: స్టార్ మా కొత్త సీరియల్ `భానుమతి`లో ఏం చూపిస్తున్నారు? ఎందుకు చూడాలి?