విడిపోవడం ఈజీ కాదు.. కానీ తప్పేలా లేదుః `పింక్‌`బ్యూటీ కీర్తి కుల్హరి ఎమోషనల్‌ నోట్‌

First Published Apr 1, 2021, 7:02 PM IST

`పింక్‌` భామ కీర్తికుల్హరి షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్‌ 1న(గురువారం) ఈ విషయాన్ని వెల్లడించింది. కలిసి ఉండటం కంటే విడిపోవడం చాలా కష్టమని, కానీ బ్రేకప్‌ చెప్పుకోవడం తప్పేలా లేదన్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఎమోషనల్‌ నోట్‌ వైరల్‌ అవుతుంది.