MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Gossips
  • మహేష్ బాబు ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్, ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదా?

మహేష్ బాబు ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్, ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్ణయాన్ని తక్కువ అంచనా వేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభాస్ డిజాస్టర్ సినిమాను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఎంటా సినిమా? అసలు కథేంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 22 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఒక హీరో సినిమా.. మరో హీరో దగ్గరికి..
Image Credit : facebook.com/PrabhasAndMaheshBabuFC

ఒక హీరో సినిమా.. మరో హీరో దగ్గరికి..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సి సినిమా.. మరో హీరో దగ్గరకు వెళ్లడం కామన్. పరిస్థితుల ప్రభావం, కథ నచ్చకపోవడం, బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్ని కథలు వదిలేసుకుంటుంటారు హీరోలు. వదిలేసిన కథ మరొక హీరో చేసి.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. అయ్యే అనుకుంటారు. లేదా ఆసినిమా ప్లాప్ అయితే.. హమ్మయ్య అనుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది మహేష్ బాబు , ప్రభాస్ కి. మహేష్ నిర్ణయాన్ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్.. కథ బాగుంది, నచ్చిందని మనసు పడి చేసిన సినిమా డిజాస్టర్ అయ్యిందని మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహేష్ మిస్సయ్యాడు, ప్రభాస్ బుక్కయ్యాడు..
Image Credit : facebook.com/PrabhasAndMaheshBabuFC

మహేష్ మిస్సయ్యాడు, ప్రభాస్ బుక్కయ్యాడు..

ఒక హీరో వదిలేసిన సినిమాను మరొక హీరో చేయడంతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోల కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా ఓ కథను ఇలాగే రిజెక్ట్ చేశాడట.. కానీ అది తనకు నచ్చి.. బాగుంటుందని సినిమా చేశాడట ప్రభాస్. మహేష్ నిర్ణయం అతన్ని డిజాస్టర్ నుంచి కాపాడింది. ప్రభాస్ కెరీర్ ను మాత్రం డేంజర్ లో పడేసింది. ఇంతకీ ఆసినిమా ఏదో కాదు చక్రం. అవును కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఈసినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడట కృష్ణ వంశీ.

36
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ
Image Credit : mahesh babu instagram

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ బిగినింగ్ లో నటించి సూపర్ హిట్ కొట్టిన సినిమా మురారి. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచిన ఈసినిమా అప్పట్లో మంచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రతీ పెళ్లి పందిరిలో మురారి సాంగ్ వినిపించాల్సిందే. ఈసినిమా తెలుగులో అంత ప్రభావం చూపించింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో కృష్ణవంశీ చక్రం కథను ఆయనకు వినిపించినట్లు సమాచారం. 

అయితే ఆ కథ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో ఆయన దానిని వద్దనుకున్నాడట. ఆ పాత్ర తనకు సూట్ అవ్వదని అన్నాడట మహేష్. క్లైమాక్స్ లో చనిపోయే పాత్ర కావడంతో.. మహేష్ కు అది నచ్చలేదట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇది వైరల్ అయ్యింది.

46
ప్రభాస్ పట్టుబట్టి చేసిన సినిమా..
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ పట్టుబట్టి చేసిన సినిమా..

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన తర్వాత కృష్ణవంశీ ఆ కథను మరొక చిన్న హీరోతో చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోకుండా ఆ కథను ప్రభాస్ వినడం.. అది రెబల్ స్టార్ కు బాగా నచ్చేసిందట. డైరెక్టర్ వద్దులేండి అని అన్నా.. కథ నాకు బాగా నచ్చింది.. మనం చేద్దాం అని పట్టుబట్టి కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చక్రం’ సినిమాలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్ పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది.

56
ప్రభాస్ నటనకు ఫిదా అయిన యూత్..
Image Credit : Asianet News

ప్రభాస్ నటనకు ఫిదా అయిన యూత్..

చక్రం సినిమా రిజెల్ట్ ఎలా ఉన్నా.. ఈసినిమా చాలామంది యూత్ ఆడియన్స్ కు హాట్ ఫెవరెట్ గా నిలిచింది. చక్రం సినిమాను మనసుతో చూసిన ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో చక్రం పాత్రను ప్రభాస్ ప్రాణం పెట్టి నటించాడు. ఆయనలో పూర్తిస్థాయి నటుడిని ఈసినిమా బయటకు తీసిందని చెప్పోచ్చు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన హీరోలలో, ఆయన సినిమాలో నటించే ముందు, నటించిన తర్వాత నటనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని కృష్ణవంశీ సినిమాల్లో నటించిన ఆర్టిస్టుల నటనలో ఒక పరిణితి కనిపిస్తుందని టాక్ ఉంది.

66
ప్రభాస్ సినిమాలు..
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ సినిమాలు..

మొత్తానికి, ప్రభాస్ తన కెరీర్ ప్రారంభ దశలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో నటించి ఒక డిజాస్టర్ సినిమాను ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘చత్రపతి’ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. 

ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రాజాసాబ్ తో ఆడియన్స్ ముందకు వచ్చిన ప్రభాస్.. నెక్ట్స్ స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కీ2 లాంటి ప్రాజెక్ట్స్ తో అలరించడానికి రెడీగా ఉన్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Related Stories
Recommended image1
1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ కు అనారోగ్యం.. డ్రాగన్ షూటింగ్ కు బ్రేక్, ఆందోళనలో అభిమానులు, నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved