MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం.. అక్కడ `ఓజీ` సునామీ స్టార్ట్

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం.. అక్కడ `ఓజీ` సునామీ స్టార్ట్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` సినిమా విడుదలకు రెడీ అవుతుంది. అయితే విడుదలకు ఇంకా ఇరవై రోజులు ఉండగానే ఈ మూవీ నార్త్ అమెరికాలో సునామీ స్టార్ట్ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 04 2025, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 `ఓజీ`తో పవన్‌ కళ్యాణ్‌ టైమ్‌ వచ్చింది
Image Credit : Asianet News

`ఓజీ`తో పవన్‌ కళ్యాణ్‌ టైమ్‌ వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి సరైన కంటెంట్‌ పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో `తొలి ప్రేమ`, `తమ్ముడు`, `బద్రి`, `ఖుషి`, `గబ్బర్‌ సింగ్‌`, `జల్సా`, `అత్తారింటికి దారేది` వంటి చిత్రాలు నిరూపించాయి. అప్పటి క్రేజ్‌ ఇప్పుడు మళ్లీ వచ్చింది. `ఓజీ`తో మరోసారి అలాంటి పవన్‌ కళ్యాణ్‌ చూడబోతున్నామని అనిపిస్తుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న `ఓజీ`
Image Credit : Asianet News

అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న `ఓజీ`

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు గ్లింప్స్ లు మాత్రమే విడుదలయ్యాయి. రెండూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు ఉంది. కానీ `ఓజీ` సునామీ అప్పుడే స్టార్ట్ అయ్యిందనేలా ఉంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తోంది. భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది. ఈ మూవీ ఇప్పటికే నార్త్ అమెరికాలో ఒక మిలియన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టడం విశేషం. కేవలం ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లోనే తొమ్మిది కోట్లని వసూలు చేసింది.

35
నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు
Image Credit : Youtube print shot/ Sony Music South

నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ లో సరికొత్త రికార్డు

అత్యంత వేగంగా ఒక మిలియన్‌ డాలర్లని వసూలు చేసిన చిత్రంగా `ఓజీ` రికార్డు సృష్టించింది. అక్కడ సునామీ స్టార్ట్ చేసిన ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. దీంతో ఫ్యాన్స్ కాలర్‌ ఎగరేస్తున్నారు. నిజానికి పవన్‌ ఫ్యాన్స్ ఇలాంటి సందర్బం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్‌ ఇప్పుడొచ్చింది. దీంతో వాళ్లు రెచ్చిపోతున్నారు. సంబరాలు ముందే స్టార్ట్ చేస్తున్నారు. ఈ హైప్‌కి తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్‌ ఉంటే ఇక `ఓజీ` బాక్సాఫీసు వద్ద సృష్టించే సునామీని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

45
ఓజాస్‌ గంభీరగా రచ్చ చేయబోతున్న పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Youtube print shot/ Sony Music South

ఓజాస్‌ గంభీరగా రచ్చ చేయబోతున్న పవన్‌ కళ్యాణ్‌

`ఓజీ`లో ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ మూవీ విడుదలకు మూడు వారాల ముందే ఓజీగా పవన్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా, పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు. `ఓజీ` చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. 'ఓజీ'పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఓజీ' వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, మైలురాయి చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

55
సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతున్న `ఓజీ
Image Credit : Youtube print shot/ Sony Music South

సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతున్న `ఓజీ

పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి తారాగణం ఉన్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
`ఘాటి` సినిమాకి అనుష్క తీసుకున్న శాలరీ ఎంతో తెలుసా? అస్సలు ఊహించరు
Recommended image2
ఎన్టీఆర్‌ `బొబ్బిలిపులి`పై పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఆలోచనలో పడ్డ చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved