- Home
- Entertainment
- ఎన్టీఆర్ `బొబ్బిలిపులి`పై పోటీగా వచ్చి అడ్రస్ లేకుండా పోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఆలోచనలో పడ్డ చిరు
ఎన్టీఆర్ `బొబ్బిలిపులి`పై పోటీగా వచ్చి అడ్రస్ లేకుండా పోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఆలోచనలో పడ్డ చిరు
ఎన్టీ రామారావు నటించిన `బొబ్బిలిపులి` మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ మూవీకి పోటీగా వచ్చిన చిరంజీవి చిత్రం అడ్రస్ లేకుండా పోయింది. ఆ కథేంటో చూద్దాం.

ఎన్టీఆర్ కి పోటీగా వచ్చిన చిరంజీవి
1980లో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ పీక్‌లో ఉంది. వరుస విజయాలు పడుతున్నాయి. కమర్షియల్ హిట్స్ తో దుమ్ములేపుతున్నారు. పౌరాణిక చిత్రాల హవా తగ్గిన తర్వాత ఆయన కమర్షియల్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టారు. సాలిడ్ మూవీస్ పడటంతో అవి బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ వరుసగా ఇండస్ట్రీ హిట్లని అందుకున్నారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్‌కి పోటీగా వచ్చిన చిరంజీవి మూవీ అడ్రస్ లేకుండా పోయింది.
ఎన్టీఆర్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `బొబ్బిలి పులి`
ఎన్టీఆర్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మూవీస్‌లో `బొబ్బిలిపులి` ఒకటి. `అడవి రాముడు`, `వేటగాడు` చిత్రాలతో దుమ్ములేపిన ఎన్టీఆర్ అదే జోరులో `బొబ్బిలిపులి`తో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నారు. 1982 జులై 9న విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. వడ్డే రమేష్ నిర్మాత. పొలిటికల్ సెటైర్లతో ఉన్న ఈ మూవీ అనేక రాజకీయపరమైన అవాంతరాలను ఫేస్ చేసింది. ప్రభుత్వం విడుదలను అడ్డుకుంది. దీనికోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు సినిమా విడుదలయ్యింది. కానీ వివాదమే సినిమాకి మంచి ప్రమోషన్ చేసింది. ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న అన్ని పాత రికార్డులను బ్రేక్ చేసింది. తొలి రోజు ఏకంగా రూ.13 లక్షలు వసూలు చేసి సరికొత్త సంచలనంగా నిలిచింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీకి రాజమార్గం వేసిన `బొబ్బిలిపులి`
యాభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో 3.5కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 39 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. రెండు మూడు సెంటర్లలో 175రోజులు ప్రదర్శించబడింది. అలాగే కొన్ని థియేటర్లలో షిఫ్ట్ లు మారుస్తూ ఏడాదిపాటు ప్రదర్శించడం విశేషం. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా మారడానికి, అందరి చూపు ఆయనవైపు తిరగడానికి ఈ మూవీ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు. ఏదేమైనా `బొబ్బిలిపులి` సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు.
`బొబ్బిలి పులి` మీద పోటీగా వచ్చి దెబ్బ తిన్న చిరంజీవి
`బొబ్బిలిపులి` వచ్చిన వారం గ్యాప్‌తోనే చిరంజీవి నటించిన `ఇది పెళ్లంటారా` అనే మూవీ విడుదలైంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించారు. చిరంజీవి, రాధిక కలిసి నటించారు. జులై 16న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డీలా పడింది. ఓ వైపు ఎన్టీఆర్ `బొబ్బిలిపులి`తో ప్రభంజనం సృష్టిస్తుండగా, చిరంజీవి `ఇది పెళ్లంటారా` మూవీ దాని ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. తక్కువ సమయంలోనే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా స్థానంలో ఎన్టీఆర్ మూవీనే ప్రదర్శించడం విశేషం. దీంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారట.
ఎన్టీఆర్ ప్లేస్‌ని భర్తీ చేసిన చిరు
చిరంజీవికి `ఖైదీ` వరకు స్ట్రుగల్స్ తప్పలేదు. ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణించారు చిరు. అదే సమయంలో రామారావు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేశారు. వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకుని స్టార్‌గా ఎదిగారు. పాటలు, డాన్సులు, ఫైట్లతో దుమ్ములేపారు. ఆయన సినిమాల కోసం ఆడియెన్స్ క్యూ కట్టేవారు. అలా మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఇప్పుడు 70ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లు ఉండటం విశేషం. అందులో `విశ్వంభర`, `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రీకరణ దశలో ఉన్నాయి. శ్రీకాంత్ ఓడెల మూవీ, బాబీ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది.