- Home
- Entertainment
- OTT: పెళ్లి అయిన మహిళలే టార్గెట్, శారీరకంగా వాడుకుని ఆపై.. ఓటీటీలో షాకింగ్ క్రైమ్ థ్రిల్లర్
OTT: పెళ్లి అయిన మహిళలే టార్గెట్, శారీరకంగా వాడుకుని ఆపై.. ఓటీటీలో షాకింగ్ క్రైమ్ థ్రిల్లర్
OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాషల సినిమాలను కూడా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి ఓ సైకో థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటీటీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా మూవీ.? కథేంటో తెలుసుకుందాం.

థియేటర్లలో సంచలనం… ఇప్పుడు ఓటీటీలో అదే మ్యాజిక్
ఇటీవల థియేటర్లలో విడుదలై అంచనాలను మించిన విజయం సాధించిన కలాంకావల్ అనే సైకో థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. చాలా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తం కలెక్షన్లు రూ.80 కోట్ల మార్క్‌ను దాటడంతో నిర్మాతలకు భారీ లాభాలు దక్కాయి. థియేటర్ ఆడియెన్స్ ఇచ్చిన సూపర్ రెస్పాన్స్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులకూ రిపీట్ అవుతోంది.
ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయినా ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. సీరియల్ కిల్లర్ నేపథ్యంతో సాగిన కథ, మొదటి సీన్ నుంచే టెన్షన్ పెంచే స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులు ఈ సినిమాకు ప్రధాన బలం. అందుకే ఐఎమ్‌డీబీ వంటి ప్లాట్‌ఫాంలలో కూడా టాప్ రేటింగ్ సాధిస్తూ ఓటీటీలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
రియల్ క్రైమ్ ఆధారంగా రూపొందిన భయానక కథ
ఈ సినిమా కథ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించారు. ఒకప్పుడు తమిళనాడు, కేరళ పోలీసులను తీవ్రంగా కలవరపెట్టిన సైనైడ్ మోహన్ కేసు ప్రేరణగా ఈ కథను తెరకెక్కించారు. నిజ సంఘటనల నుంచి తీసుకున్న అంశాలు కావడంతో కథలోని ప్రతి సీన్ మరింత భయాన్ని కలిగిస్తుంది. కథా ప్రవాహం ఎక్కడా నెమ్మదించకుండా చివరి వరకూ ఉత్కంఠను నిలబెట్టేలా రూపొందించారు.
స్టాన్లీ దాస్ పాత్ర…
స్టాన్లీ దాస్ (మమ్ముటి) అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. బయటకు కనిపించే జీవితం సాధారణంగానే ఉంటుంది. కానీ అతనిలో దాగి ఉన్న మరో కోణం అత్యంత వికృతమైనది. ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని నమ్మిస్తాడు. కొత్త జీవితం ఆశ చూపించి హోటల్ గదులకు తీసుకెళ్లి మొదట వారితో శారీరకంగా కలుస్తాడు ఆ తర్వాత సైనైడ్ ఉపయోగించి హతమారుస్తాడు. ఈ విధంగా ఇరవై మందికి పైగా మహిళలను హతమార్చాడు.
You think you know him but you don’t.
Witness #Kalamkaval, now streaming on Sony LIV.#Mammootty@mammukka#Vinayakan#MammoottyKampany#JithinKJose@SamadTruth#WayfarerFilms#TruthGlobalFilms#KalamkavalOnSonyLIVpic.twitter.com/iUJ9tUwO32— Sony LIV (@SonyLIV) January 19, 2026
స్టాన్లీ దాస్ చివరికి ఏమయ్యాడు?
స్టాన్లీ దాస్ ఇలా సైకో కిల్లర్‌గా ఎందుకు మారాడు? పోలీసులు అతని ఆనవాళ్లను ఎలా గుర్తించారు? చివరికి అతడు పట్టుబడ్డాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాలి. ఈ ఉత్కంఠభరిత కథకు మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రాణం పోశారు. ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ మలయాళం సినిమా ప్రస్తుతం సోనీ లివ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఇష్టంగా చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

