MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sankranthi Movies కలెక్షన్లు.. చిరంజీవి, నవీన్‌ పొలిశెట్టిలదే సంక్రాంతి.. ప్రభాస్‌, రవితేజల మూవీస్‌ డిజాస్టర్లే

Sankranthi Movies కలెక్షన్లు.. చిరంజీవి, నవీన్‌ పొలిశెట్టిలదే సంక్రాంతి.. ప్రభాస్‌, రవితేజల మూవీస్‌ డిజాస్టర్లే

సంక్రాంతికి ఐదు సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే. సంక్రాంతి సీజన్‌ ముగిసింది. ఏ సినిమా విజయం సాధించింది. ఏది ఫ్లాప్‌ అయ్యింది. సంక్రాంతి సినిమాల కలెక్షన్లు తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 20 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సంక్రాంతి సినిమాల కలెక్షన్లు
Image Credit : Asianet News

సంక్రాంతి సినిమాల కలెక్షన్లు

ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ప్రభాస్‌ నటించిన `ది రాజాసాబ్‌`,  చిరంజీవి, వెంకటేష్‌ కలిసి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు`, రవితేజ హీరోగా వచ్చిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, శర్వానంద్‌ నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రాలు విడుదలయ్యాయి. మరి వీటిలో ఏది హిట్‌, ఏది ఫట్‌. ఏ మూవీ సంక్రాంతి విన్నర్‌? ఏ మూవీ డిజాస్టర్‌. ఓవరాల్‌గా ఏ సినిమాకి ఎంత కలక్షన్లు వచ్చాయి. ఏది బ్రేక్‌ ఈవెన్‌ దాటిందనేది సంక్రాంతి సినిమాల కలెక్షన్లలో చూద్దాం. 

26
ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` పెద్ద డిజాస్టర్‌
Image Credit : T-Series Malayalam

ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` పెద్ద డిజాస్టర్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మొదటి మూవీ ప్రభాస్‌ నటించిన `ది రాజాసాబ్‌`. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ మూవీకి ప్రారంభం నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో అది కలెక్షన్లపై పడింది. ఇది 11 రోజులు రూ.205కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. రూ.120కోట్ల మేరకు షేర్‌ వచ్చింది.   ఈ సినిమా హిట్‌ కావాలంటే ఇంకా రూ.90కోట్ల షేర్‌ రావాలి. అది ఇప్పుడు సాధ్యం కాదు. దీంతో ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే
Related image2
Top 10 Heroines: టాప్‌లోకి దూసుకొచ్చిన నయనతార, దీపికా.. కాజల్‌, త్రిషకి ఝలక్‌.. ఇండియా టాప్‌ హీరోయిన్‌ ఈమెనే
36
సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్‌.. సంక్రాంతి విన్నర్‌
Image Credit : X/@Shine_Screens

సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్‌.. సంక్రాంతి విన్నర్‌

ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ విడుదలయ్యింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 8 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఇది బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. ఓరకంగా ఇది సంక్రాంతి విన్నర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. 

46
కొద్దిపాటి నష్టాల్లో రవితేజ సినిమా
Image Credit : X/@DirKishoreOffl

కొద్దిపాటి నష్టాల్లో రవితేజ సినిమా

జనవరి 13న రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ విడుదలయ్యింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా డీసెంట్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ఏడు రోజుల్లో సుమారు రూ.17కోట్లు వచ్చాయి. అంటే పది కోట్ల వరకు షేర్‌ సాధించింది. ఇంకా పది కోట్ల షేర్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూవీకి నష్టాలు తప్పవు.

56
నవీన్‌ పొలిశెట్టికి జాక్‌ పాట్‌
Image Credit : Youtube@adityamusic

నవీన్‌ పొలిశెట్టికి జాక్‌ పాట్‌

జనవరి 14న నవీన్‌ పొలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ విడుదలైంది. ఇది ఇప్పటికే వంద కోట్లు దాటింది. చిరంజీవి మూవీ తర్వాత అత్యంత విజయవంతంగా రన్‌ అవుతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూలు చేసిందని టీమ్‌ ప్రకటించింది. కానీ రూ.70-80కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఇప్పటికే సుమారు రూ.40కోట్ల షేర్‌ వచ్చిందని తెలుస్తోంది. రూ.28కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని లాభాల్లో వెళ్తోంది.

66
సేఫ్‌లోకి శర్వానంద్‌ మూవీ
Image Credit : X/@AKentsOfficial

సేఫ్‌లోకి శర్వానంద్‌ మూవీ

ఇక సంక్రాంతికి చివరగా విడుదలైన మూవీ `నారీ నారీ నడుమ మురారి`. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకుడు. అనిల్‌ సుంకర నిర్మాత. ఈ మూవీకి ప్రారంభం నుంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. హిలేరియస్‌గా ఆకట్టుకుంటోంది. వసూళ్ల పరంగానూ మెప్పిస్తుంది. థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్లు తగ్గాయి. కానీ మూవీ మాత్రం అదిరిపోయింది. అయినప్పటికీ సంక్రాంతి పోటీలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.21కోట్లు వచ్చాయి. పది కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇక సోమవారం నుంచే లాభాల్లోకి వెళ్లింది. ఇలా ఈ సంక్రాంతికి చిరంజీవి మూవీ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత `అనగనగా ఒక రాజు`, `నారీ నారీ నడుమ మురారి` తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రవితేజ మూవీ కొద్దిపాటి నష్టాలతో క్లోజ్‌ కాబోతుంది. ప్రభాస్‌ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలవబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
దగ్గుబాటి వెంకటేష్
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image2
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Recommended image3
Dhanush Kara Release Date: రాంచరణ్ పెద్దికి పోటీగా దిగుతున్న ధనుష్.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు
Related Stories
Recommended image1
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే
Recommended image2
Top 10 Heroines: టాప్‌లోకి దూసుకొచ్చిన నయనతార, దీపికా.. కాజల్‌, త్రిషకి ఝలక్‌.. ఇండియా టాప్‌ హీరోయిన్‌ ఈమెనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved