Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Dhanush: స్టార్ హీరో ధనుష్ హీరోయిన్ మృణాళ్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని.. వారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే..

Mrunal Dhanush
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సినిమాలతో ఆయన దూసుకుపోతున్నారు. కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందో.. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఆయన సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ల వైవాహిక సంబంధానికి స్వస్తి పలికారు.విడాకుల తర్వాత.. మృణాళ్ తో పరిచయం ఏర్పడిందని.. అది త్వరలోనే పెళ్లి చేసుకునేదాకా వెళ్లిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు ధనుష్ కానీ, మృణాళ్ కానీ స్పందించలేదు. కానీ.. ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే.. ఇలాంటి రూమర్స్ ధనుష్ విషయంలో చాలాసార్లు వినిపించాయి. గతంలో ఇతర హీరోయిన్స్ తో ధనుష్ కి సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. మరి, ఆ హీరోయిన్లు ఎవరో ఓసారి చూద్దాం...
శ్రుతి హాసన్..
ధనుష్ సినిమా కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిన సినిమా 3. ఈ మూవీలో ధనుష్, శ్రుతి కెమిస్ట్రీ బాగా పండింది. దీంతో.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ కారణంగానే ధనుష్ కుటుంబ జీవితంలో మనస్పర్థలు వచ్చాయి అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ వార్తలను శ్రుతి హాసన్ అప్పుడే ఖండించడం గమనార్హం.
2.అమలాపాల్..
రఘువరన్ బీటెక్, వీఐపీ సినిమాలో ధనుష్, అమలాపాల్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమయాణం మొదలైందంటూ వార్తలు వచ్చాయి. అమలాపాల్ విడాకులకు కూడా ఈ సినిమాలే కారణం అని రూమర్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అమలపాల్ మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.
3.త్రిష..
చాలా కాలం క్రితం ధనుష్ , త్రిష మధ్య మంచి స్నేహం ఉండేది. కొన్ని పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. కానీ, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులమని పలుమార్లు స్పష్టం చేశారు.
4. నిత్య మీనన్ ..
'తిరుచిత్రంబలం' (తెలుగులో 'తిరు') సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, ధనుష్ , నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.
మృణాళ్ ఠాకూర్‌తో పెళ్లి వార్తల్లో నిజమెంత?
ప్రస్తుతం ధనుష్ , మృణాళ్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని, ఆ క్రమంలోనే ఇద్దరి పేర్లు కలిపి ప్రచారం చేస్తున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ధనుష్ ప్రస్తుతం తన దర్శకత్వంలో బిజీగా ఉండగా, మృణాళ్ తన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

