- Home
- Business
- Post office: ఇలా చేస్తే మీ డబ్బులు గుడ్లు పెట్టడం ఖాయం.. 5 ఏళ్లలో రూ. 4.5 లక్షల వడ్డీ
Post office: ఇలా చేస్తే మీ డబ్బులు గుడ్లు పెట్టడం ఖాయం.. 5 ఏళ్లలో రూ. 4.5 లక్షల వడ్డీ
Post office: డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని సక్రమంగా ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే మన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం వచ్చే అలాంటి ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్
పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ భారతీయులలో ఎక్కువ నమ్మకం పొందిన పెట్టుబడి మార్గాల్లో ఒకటి. పిల్లలు, మహిళలు, యువత, వృద్ధులు అందరికీ అనుకూలంగా రూపొందించారు. ఈ స్కీమ్స్‌కి కేంద్ర ప్రభుత్వం హామీ ఉండటం ప్రధాన ఆకర్షణ. రిస్క్ భయం లేకుండా స్థిరమైన రాబడులు పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.
టైమ్ డిపాజిట్‌పై లభించే వడ్డీ రేట్లు
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి కాలాన్ని బట్టి వడ్డీ రేట్లు మారతాయి.
* ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ పొందొచ్చు.
* రెండు సంవత్సరాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ.
* మూడు సంవత్సరాల డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ
* ఐదు సంవత్సరాల డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు ఇతర భద్రమైన స్కీమ్స్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి.
ఐదు సంవత్సరాల్లో రూ.2 లక్షలకు పైగా లాభం
ఈ స్కీమ్‌లో ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. రూ.5 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల తర్వాత మొత్తం రూ.7,24,974 వస్తుంది. అంటే కేవలం వడ్డీ ద్వారానే రూ.2,24,974 లాభం లభిస్తుంది. స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్.
ఒకవేళ రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే
పెట్టుబడి మొత్తం: రూ.10,00,000
కాలవ్యవధి: 5 సంవత్సరాలు
వార్షిక వడ్డీ రేటు: 7.5% లభిస్తుంది.
5 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం వడ్డీ: రూ.4,49,948 (సుమారు) అవుతుంది. ఇక మెచ్యూరిటీ విలువ రూ.14,49,948 (సుమారు) అంటే కేవలం కేవలం వడ్డీ ద్వారానే దాదాపు రూ.4.5 లక్షలు లాభం పొందొచ్చు. అందులోనూ ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ భద్రతతో ఈ రాబడి లభిస్తుంది
రిస్క్ లేని పెట్టుబడి
టైమ్ డిపాజిట్ స్కీమ్ పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి విధానం. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. బ్యాంక్ ఎఫ్డీల మాదిరిగానే పనిచేసినా, ప్రభుత్వ హామీ ఉండటం వల్ల మరింత భద్రత కల్పిస్తుంది. రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నవారికి, పెద్ద మొత్తాన్ని భద్రంగా పెట్టాలనుకునే వారికి ఇది సరైన మార్గం.
పన్ను మినహాయింపు కూడా
ఈ స్కీమ్‌లో ఐదు సంవత్సరాల పెట్టుబడికి ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే పెట్టుబడితో పాటు పన్ను భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. భద్రత, మంచి వడ్డీ, పన్ను లాభం – ఈ మూడు కలసి ఈ స్కీమ్‌ను ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి.

