MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం

NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం

ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ సమయంలో మెగాస్టార్‌కి వార్నింగ్‌ ఇచ్చాడట రామారావు. కానీ చిరు వినలేదు. దీంతో ఆరు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 30 2026, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవికి ఎన్టీఆర్‌ వార్నింగ్‌
Image Credit : x.com/guptanagu8

చిరంజీవికి ఎన్టీఆర్‌ వార్నింగ్‌

లెజెండరీ నటుడు ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ సినిమా లెక్కలు మార్చేశారు. తెలుగు సినిమాని కమర్షియల్‌ వైపు నడిపించారు. దాన్ని చిరంజీవి ముందుకు తీసుకెళ్లారు. చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా దశ దిశ మారిపోయిందని చెప్పొచ్చు. పూర్తి కమర్షియల్‌గా టర్న్ తీసుకుంది. ఎన్టీఆర్‌ సినిమాల నుంచి తప్పుకున్నాక, ఆ లోటుని చిరంజీవి భర్తీ చేశారు. అదే సమయంలో ఆ స్థానాన్ని తను కైవసం చేసుకున్నారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే వీరిద్దరి కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ సమయంలో చిరంజీవికి ఎన్టీఆర్‌ ఒక వార్నింగ్‌ ఇచ్చారు. అదేంటనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 `తిరుగులేని మనిషి`లో నటించిన ఎన్టీఆర్‌, చిరంజీవి
Image Credit : our own

`తిరుగులేని మనిషి`లో నటించిన ఎన్టీఆర్‌, చిరంజీవి

ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్క చిత్రమిది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రతి అగ్నిహోత్రి హీరోయిన్‌గా నటించింది. ఇది 1981లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. మేకర్స్ ప్రయత్నాలు చేసినా అనేక కారణాలతో అవి పట్టాలెక్కలేదు. అయితే ఈ సినిమా సమయంలో చిరంజీవికి వార్నింగ్‌ ఇచ్చాడు ఎన్టీఆర్‌. యాక్షన్‌ సీన్లు చేసే సమయంలో చిరంజీవి ఉత్సాహాన్ని, అత్యుత్సాహాన్ని చూసి హెచ్చరించాడట. కానీ చిరంజీవి వినలేదు. దీంతో ఆరు నెలలు మంచానికి పరిమితం కావాల్సి వచ్చిందట.

Related Articles

Related image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Related image2
Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు
35
ఆర్టిస్ట్ లు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఎన్టీఆర్‌
Image Credit : telugu bulletin

ఆర్టిస్ట్ లు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఎన్టీఆర్‌

`తిరుగులేని మనిషి` సినిమాలో యాక్షన్‌ సీన్లు చేసేటప్పుడు ఓ ఫ్లోర్‌ నుంచి కిందకు దూకే సీన్లు ఉన్నాయట. అందులో ఇద్దరు పట్టుకుని దూకాల్సి ఉంటుంది. ఎన్టీఆర్‌ ఊపు ఇచ్చి ఆగిపోయారు. కానీ చిరంజీవి దూకేశారు. దీంతో ఎన్టీఆర్‌ ఉండి, `బ్రదర్‌ అలా దూకేశారేంటి? అలా దూకకూడదు. వాటికి డూపులు ఉంటారు. ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏమైనా అయితే అది సినిమాకి చాలా నష్టం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సమయం వేస్ట్ అవుతుంది. ఫైనాన్సియల్‌గా నష్టాలు వస్తాయి. ఆర్టిస్ట్ లు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి` అని చెప్పారు.

45
ఎన్టీఆర్‌ మాట వినని చిరు, ఆరు నెలలు మంచానికే పరిమితం
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌ మాట వినని చిరు, ఆరు నెలలు మంచానికే పరిమితం

అప్పుడు ఊ కొట్టాను కానీ ఆ తర్వాత `సంఘర్షణ` అనే సినిమాలో ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా దూకాను. అప్పుడు కాలు మడతబడి ఆరు నెలలు షూటింగ్ చేయలేకపోయాను. తర్వాత లండన్‌లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అందుకే పెద్దలు ఎంతో ఆలోచించి ఇచ్చే సలహాలను మనం పాటించాలి` అని తెలిపారు చిరంజీవి. రెండేళ్ల క్రితం లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్‌ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన సలహా తన కుటుంబాన్ని కాపాడుతుందని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఎన్టీఆర్‌ చెప్పిన మాట వినకపోవడం వల్ల చిరంజీవి ఆరు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.

55
బాబీతో సినిమా చేస్తున్న చిరంజీవి
Image Credit : Asianet News

బాబీతో సినిమా చేస్తున్న చిరంజీవి

ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి లుక్‌ టెస్ట్ చేశారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇందులో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అలాగే ఓ బాలీవుడ్‌ యాక్టర్‌ కూడా నటిస్తారని సమాచారం. మరోవైపు చిరంజీవి నటించిన `విశ్వంభర` మూవీ ఫైనల్‌ వర్క్ జరుపుకుంటుందని తెలుస్తోంది. దీన్ని జులైలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Related Stories
Recommended image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved