MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌

నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌

Nayanthara: `నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కానీ ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో తెలియదు` అంటూ నటి సోనా  భావోద్వేగానికి గురయ్యారు. విఘ్నేశ్ వ్యక్తిత్వాన్ని ఆమె మెచ్చుకున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 06 2026, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెస్ట్ కపుల్‌గా రాణిస్తోన్న నయనతార, విఘ్నేష్‌ శివన్‌
Image Credit : Insatgram

బెస్ట్ కపుల్‌గా రాణిస్తోన్న నయనతార, విఘ్నేష్‌ శివన్‌

సౌత్ ఇండియాలో 'పవర్ కపుల్' అంటే వెంటనే గుర్తొచ్చేది నయనతార, విఘ్నేశ్ శివన్.  ప్రేమ, పెళ్లి, కవల పిల్లలతో వాళ్ల లైఫ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. కానీ, ఈ అందమైన సంసారం మధ్యలో ఇప్పుడు ఓ పాత జ్ఞాపకం ప్రత్యక్షమైంది. ఒకప్పటి 'ఐటెం సాంగ్' క్వీన్ సోనా హైడెన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సోనా, విఘ్నేష్‌కి మధ్య పుకార్లు
Image Credit : Insatgram

సోనా, విఘ్నేష్‌కి మధ్య పుకార్లు

అసలు విషయం ఏంటంటే, విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayanthara) పెళ్లికి ముందే 'విక్కీ', సోనా హైడెన్ (Sona Heiden) మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో కోలీవుడ్‌లో పుకార్లు వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరుస్తూ సోనా ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 'విఘ్నేశ్ శివన్ ఒకప్పుడు నా ఆఫీసులో ఏకంగా మూడేళ్లపాటు పనిచేశాడు' అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
36
విఘ్నేష్‌ రహస్యం వెల్లడి
Image Credit : Insatgram

విఘ్నేష్‌ రహస్యం వెల్లడి

సోనా చెప్పిన దాని ప్రకారం, విఘ్నేశ్ శివన్ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ఆమె జీవితంలో అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచాడట. 'నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కానీ ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో తెలియదు' అని సోనా ఎమోషనల్ అయ్యారు. విఘ్నేశ్ చాలా మంచివాడని, కానీ అతని జీవితంలో ఓ చిన్న విషాదం (Tragedy) ఉందని, దాన్ని దాటుకుని వచ్చాడని చెప్పి కొత్త ఆసక్తిని రేకెత్తించారు.
46
నయనతారపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్
Image Credit : Insatgram

నయనతారపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్

విఘ్నేశ్ గురించి మాట్లాడుతూనే, నయనతారపై తనకు ఉన్న అభిమానాన్ని సోనా బయటపెట్టింది. 'నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. ప్రభుదేవాతో బంధం ముగిశాక ఆమె పడిన బాధ నాకు తెలుసు. వాటన్నింటినీ దాటుకుని ఈ రోజు ఓ అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. పిల్లలతో ఆమె సంతోషంగా ఉండటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ల ప్రశాంతతను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు' అని సోనా చాలా హుందాగా మాట్లాడారు.
56
ఆంధ్రావాలాలో ఐటెమ్‌ సాంగ్‌తో సోనా రచ్చ
Image Credit : Insatgram

ఆంధ్రావాలాలో ఐటెమ్‌ సాంగ్‌తో సోనా రచ్చ

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సోనా సుపరిచితమే. 'ఆయుధం', 'ఖళనాయక' సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆంధ్రావాలా' సినిమాలోనూ సోనా కనిపించింది. తన హాట్ డ్యాన్స్ నంబర్స్‌తో అప్పట్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
66
విఘ్నేష్‌తో అప్పటి రోజులను గుర్తు చేసుకొని హాట్‌ టాపిక్ గా మారిన సోనా
Image Credit : Instagram

విఘ్నేష్‌తో అప్పటి రోజులను గుర్తు చేసుకొని హాట్‌ టాపిక్ గా మారిన సోనా

మొత్తం మీద, విఘ్నేశ్ శివన్ పాత రోజుల గురించి సోనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పుడు సోనా ఆఫీసులో పనిచేసిన కుర్రాడే, ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్, లేడీ సూపర్‌స్టార్ భర్త కావడం నిజంగా విచిత్రమే కదా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Venkat: చిరంజీవికి చెప్పి హీరోయిన్లని మార్చుకున్న యంగ్ హీరోలు..బాబోయ్ వాళ్ళు మాకు వద్దు అంటూ కంప్లైంట్
Recommended image2
Suma Kanakala: సినిమాల్లో రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!
Recommended image3
Hanuman Ansh Telugu Collections: హనుమాన్‌ అంశ్‌ తెలుగులో డల్‌ కలెక్షన్లు.. టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?
Related Stories
Recommended image1
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Recommended image2
Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved