MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు

Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పెళ్లి ఘనంగా జరిగింది. కావ్య రెడ్డి మెడలో ఆయన ఈ రోజు ఉదయం మూడు ముళ్లు వేశాడు. మరి ఈ కావ్య రెడ్డి ఎవరు? ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది చూస్తే.. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 30 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్‌, కావ్య రెడ్డి పెళ్లి
Image Credit : Asianet News

ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్‌, కావ్య రెడ్డి పెళ్లి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. కావ్యరెడ్డిని ఆయన మ్యారేజ్‌ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారి సమక్షంలో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి మ్యారేజ్‌ జరగడం విశేషం. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగడం విశేషం. బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌.. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పెద్ద కొడుకు.

26
బెల్లంకొండ శ్రీనివాస్‌, కావ్య రెడ్డి మ్యారేజ్‌ ఫోటోలు
Image Credit : Asianet News

బెల్లంకొండ శ్రీనివాస్‌, కావ్య రెడ్డి మ్యారేజ్‌ ఫోటోలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కావ్య రెడ్డి మ్యారేజ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. తన భార్య ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు సాయిశ్రీనివాస్‌. ఇందులో ఈ కొత్త జంట ఎంతో అందంగా ఉంది.

Related Articles

Related image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Related image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
36
పెళ్లిలో వెలిగిపోతున్న కొత్త జంట
Image Credit : Asianet News

పెళ్లిలో వెలిగిపోతున్న కొత్త జంట

వీరిద్దరు తమ పెళ్లి సందర్భంగా మురిసిపోతున్నారు. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా బెల్లంకొండ మ్యారేజ్‌ చేసుకున్న కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి తెలుసుకుంటే, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

46
కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే
Image Credit : Asianet News

కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్య రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. ఆమెకు సినీ రంగానికి ఎలాంటి సంబంధం లేదు. కావ్య రెడ్డి కూడా లా చేశారు. తనే కాదు, తన తాత కూడా న్యాయమూర్తి కావడం విశేషం. మొత్తంగా బెల్లంకొండ లాయర్‌ని పెళ్లి చేసుకున్నారని చెప్పొచ్చు.

56
క్లాస్‌ మేట్‌ ద్వారా కావ్య రెడ్డి పరిచయం
Image Credit : Asianet News

క్లాస్‌ మేట్‌ ద్వారా కావ్య రెడ్డి పరిచయం

కావ్య రెడ్డి సిస్టర్‌.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఒకే కాలేజీలో చదువుకున్నారట. ఆమె ద్వారా చెల్లి పరిచయం అయ్యింది. అది వీరి మధ్య ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లపాటు సాగిన ఈ ప్రేమకి పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో మ్యారేజ్‌ ఫిక్స్ చేసుకున్నారు. మార్చిలో ఈ ఇద్దరికి రోకా వేడుక జరగ్గా, ఏప్రిల్‌ 5 ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నేడు ఏప్రిల్‌ 30న తిరుమలలో వివాహం చేసుకున్నారు.

66
హీరోగా రాణిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌
Image Credit : Asianet News

హీరోగా రాణిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ టాలీవుడ్‌లో హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన `అల్లుడుశీను`తో హీరోగా పరిచయం అయ్యాడు. `స్పీడున్నోడు, `జయ జానకి నాయక`, `సాక్ష్యం, `కవచం`, `సీత`, `రాక్షసుడు`, `అల్లుడు అదుర్స్, `ఛత్రపతి`(హిందీ), భైరవం`, `కిష్కింధపురి` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `టైసన్‌ నాయుడు` మూవీలో, `హైంధవ` మూవీలో నటిస్తున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ
Recommended image3
Mandakini: దావూద్‌తో ఎఫైర్, సినిమాలకు దూరం.. మందాకిని జీవితంలోని చీకటి కోణాలు
Related Stories
Recommended image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved