- Home
- Entertainment
- NTR-Sobhan Babu: వాడిది మట్టిబుర్ర, శోభన్‌బాబుపై సెట్‌లోనే గట్టిగా అరిచిన ఎన్టీఆర్.. రైటర్ వద్ద సోగ్గాడి ఆవేదన
NTR-Sobhan Babu: వాడిది మట్టిబుర్ర, శోభన్‌బాబుపై సెట్‌లోనే గట్టిగా అరిచిన ఎన్టీఆర్.. రైటర్ వద్ద సోగ్గాడి ఆవేదన
శివ శక్తి దత్త.. శోభన్ బాబుకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్.. సోగ్గాడిని తిట్టిన సంఘటన పంచుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు దీటుగా ఎదిగిన శోభన్ బాబు
శోభన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడిగా, అందగాడిగా పాపులర్ అయ్యారు. ఆయన్ని తెలుగు ఆడియెన్స్ అంతా అభిమాన నటుడిగా కొలుస్తారు. ముఖ్యంగా మహిళా ఆడియెన్స్ కి ఆయన ఆరాధ్యనటుడు.
ఫ్యామిలీ చిత్రాలతో విశేషమైన మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందారు. మరోవైపు నటుడిగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజులకు దీటుగా రాణించారు. సూపర్ స్టార్‌గా వెలిగారు.
కెరీర్ ప్రారంభంలో సోగ్గాడికి అవమానాలు
శోభన్ బాబు కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్ చేశారు. ఓ మూవీ నుంచి తీసేశారు. మరో సినిమాలో మెయిన్ హీరో రోల్‌ని కాదని సెకండ్ హీరోని చేశారు.
తనని ఇష్టపడ్డ జయలలిత తల్లినే ఆయన్ని దారుణంగా అవమానించింది. ఎవరు ఎంత అవమానించినా ఆయన అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు.
స్టార్ హీరోగా ఎదిగారు. ఎవరైతే అవమానించారే వారే వాహ్ అని, వారిచేతనే క్లాప్ కొట్టించుకున్నారు. అంతేకాదు స్టార్ హీరోల్లోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగానూ ఎదిగారు.
`సీతారామ కళ్యాణం`లో లక్ష్మణుడిగా శోభన్ బాబు
ఇదిలా ఉంటే శోభన్ బాబుని ఎన్టీఆర్ తిట్టాడట. అది కెరీర్ ప్రారంభంలో. సోగ్గాడి వెరీ బిగినింగ్‌లో సైడ్ రోల్స్ చేశారు. రామారావుతో కలిసి చాలా సినిమాలు చేశారు.
అందులో `సీతా రామ కళ్యాణం` సినిమా చేస్తున్నారు. దీనికి ఎన్టీఆర్ దర్శకుడు. ఆయన ఇందులో రావణుడి పాత్రని పోషించారు. రాముడిగా హరనాథ్, లక్ష్మణుడిగా శోభన్‌బాబు, సీతగా గీతాంజలి నటించింది.
1961లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. చాలా సెంటర్లలో 150 రోజులు ప్రదర్శించబడింది.
శోభన్ బాబుని సెట్‌లోనే తిట్టిన ఎన్టీఆర్
అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో లక్ష్మణుడి పాత్ర పోషించిన శోభన్ బాబుని రామారావు బాగా తిట్టేవాడట. సెట్లోనే గట్టిగా అరిచేవాడట. ఈ విషయాన్ని తాజాగా కన్నుమూసిన శివ శక్తి దత్తా తన పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ మూవీలో రావణ బ్రహ్మ క్యారెక్టర్ చేశారు శివశక్తి దత్తా. ఈ మూవీ షూటింగ్ స్టూడియోలో జరుగుతుందట. అడవి సెట్ వేశారట. రాముడు, లక్ష్మణుడు, సీతలపై చిత్రీకరణ జరుగుతుంది.
ఆ సమయంలో షాట్ ఓకే అనుకున్నాక రామారావు వచ్చి ఎలా ఉందని తన సలహాలు అడిగేవారట. తాను ఏదైనా కరెక్షన్ చెబితే చేసేవారట.
శివ శక్తి దత్తా వద్ద సోగ్గాడి ఆవేదన
అది చూసిన శోభన్ బాబు షాట్ గ్యాప్‌లో తన వద్దకు వచ్చి, రామారావు మీకు బాగా తెలిసినట్టుంది, కొంచెం ఆయనకు చెప్పండి, బాగా తిడుతున్నాడు అని తన గోడు వెల్లబోసుకున్నాడట.
అప్పటికీ అది శోభన్‌బాబుకి మూడో సినిమా. పెద్దగా గుర్తింపులేదు. దీంతో సరే అండి అని చెప్పారట శివశక్తి దత్తా. రామారావు వచ్చాక మీరు అరుస్తుంటే ఆ అబ్బాయి ఫీలవుతున్నారండి అని చెప్పారట.
దానికి రామారావు స్పందిస్తూ, వాడూ, వాడి మట్టి బుర్ర, వాడికి ఏం తెలియదు` అంటూ తిట్టేవాడట. అలాంటి మట్టిబుర్రనే వందల సినిమాలు చేసి, తెలుగులో సూపర్ స్టార్‌గా, సోగ్గాడిగా వెలిగారు. ఎవరు ఏమవుతారో చెప్పలేం` అని అన్నారు శివశక్తి దత్తా.
ఆయన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.