- Home
- Entertainment
- రాజమౌళి హీరోగా శివశక్తి దత్తా దర్శకత్వంలో సినిమా, రిజల్ట్ ఇదే.. కీరవాణి తండ్రి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలివే
రాజమౌళి హీరోగా శివశక్తి దత్తా దర్శకత్వంలో సినిమా, రిజల్ట్ ఇదే.. కీరవాణి తండ్రి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలివే
ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రైటర్ మాత్రమే కాదు, ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారు. మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ మూవీలో రాజమౌళి హీరో కావడం విశేషం.

కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూత
సంగీత లెజెండ్ కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన ఫ్యామిలీలోనే కాదు, చిత్ర పరిశ్రమలోనూ విషాదం ఛాయలు అలుముకున్నాయి.
అయితే ఈ సందర్భంగా శివశక్తి దత్తాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆయన చిత్రకారుడిగా, రైటర్‌గా బాగా ఫేమస్. అనేక సూపర్ హిట్ పాటలు రాశారు.
శివ శక్తి దత్తా దర్శకత్వం వహించిన బాలల చిత్రం
శివశక్తి దత్తాలో దర్శకుడు కూడా ఉన్నారు. కాకపోతే సక్సెస్ కాలేకపోయారు. దర్శకుడిగా ఆయన తన టాలెంట్‌ని చూపించలేకపోయారు. అందులో భాగంగా శివశక్తి దత్తా తొలి ప్రయత్నంగా బాలల చిత్రాన్ని రూపొందించారు.
`పిల్లనగ్రోవి` పేరుతో ఆయన సినిమాని తెరకెక్కించారు. దీన్ని ఆయన తమ్ముడు, రైటర్ విజయేంద్రప్రసాద్ నిర్మించడం విశేషం. అన్నాతమ్ములు కలిసి ఓ ప్రయోగం చేశారు.
రాజమౌళి మెయిన్ లీడ్‌గా `పిల్లనగ్రోవి` మూవీ
ఇందులో రాజమౌళి హీరో కావడం విశేషం. రాజమౌళి చిన్నప్పుడు బాల నటుడిగా మెయిన్ లీడ్ చేసిన బాలల చిత్రమే `పిల్లనగ్రోవి`. జక్కన్న చిన్నగా ఉన్నప్పుడు ఆయన్ని లీడ్‌గా పెట్టి ఈ మూవీ తీశారు.
మరికొందరు బాల నటులు ఇందులో నటించారు. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. బడ్జెట్ సమస్యనా? కంటెంట్‌లో లోపమా? కారణం ఏదైనా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత మళ్లీ చాలా ఏళ్లపాటు దర్శకుడిగా సాహసం చేయలేదు శివశక్తి దత్తా. కానీ రాజమౌళి లీడ్‌గా వెండితెరపై కనిపించే అవకాశం కోల్పోయారు.
శివశక్తి దత్తా దర్శకుడిగా రూపొందించిన సినిమాలు
కొంత గ్యాప్‌తో 1996లో `అర్థాంగి` పేరుతో మరో సినిమాని రూపొందించారు. దీనికి విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్తా దర్శకులు కావడం విశేషం. వీరిద్దరు కలిసి ఈ మూవీని తెరకెక్కించారు.
వసుధా చిత్ర పతాకంపై కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు. దీనికి కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చారు దత్తా.
`చంద్రహాస్`తో శివశక్తి దత్తాకి మరో చేదు అనుభవం
చాలా గ్యాప్‌తో 2007లో నటుడు హరనాథ్ హీరోగా `చంద్రహాస్` అనే మూవీకి దర్శకత్వం వహించారు శివ శక్తి దత్తా. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది. కానీ పాటలకు బాగా అలరించాయి.
ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ రోల్ చేశారు. ఛత్రపతి శివాజీగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇలా రైటర్‌గా, ముఖ్యంగా పాటల రచయితగా సక్సెస్ అయిన శివ శక్తి దత్తా దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.