- Home
- Entertainment
- 25లక్షలతో తీస్తే 8కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? టాలీవుడ్ మొత్తం షాక్
25లక్షలతో తీస్తే 8కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? టాలీవుడ్ మొత్తం షాక్
చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక స్టార్ డమ్ రావడానికి ఐదారు ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఒక సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది.

సోలోగా మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయన సినిమా జర్నీ చాలా పెద్దది.
డాన్సులతో ఆకట్టుకుంటూ అందరి దృష్టిలో పడుతూ, ఫుల్ స్పీడ్‌తో దూసుకొచ్చారు. అదే సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు ఫేస్ చేశారు.
అయితే చిరంజీవి తనని తాను నిరూపించుకోవడానికి, తానేంటో ఇండస్ట్రీకి తెలియజేయడానికి చాలా టైమే పట్టింది.
దాదాపు ఐదేళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యారు. హీరోగా, విలన్‌గా, గెస్ట్ రోల్స్, క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు.
ప్రారంభంలో గుర్తింపు కోసం చిరంజీవి స్ట్రగుల్స్
సుమారు 55 సినిమాల వరకు చిరంజీవి పేరు కొద్ది మందికే తెలుసు. అప్పుడప్పుడే ఆయన గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
`శుభలేఖ` మూవీ చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. కమర్షియల్‌గా బాగానే ఆకట్టుకుంది. అవార్డులు కూడా వచ్చాయి. ఈ మూవీతో కొంత చిరంజీవి గురించి తెలిసింది.
కుర్రాడు బాగా చేస్తున్నాడని అనుకున్నారు. కానీ స్టార్‌డమ్ రాలేదు. ఈ మూవీతో మంచి పేరొస్తుంది, కానీ సరిపోవడం లేదు.
ఆయన రేంజ్ విజయాలు పడటం లేదు. ఇంకా ఏదో కావాలి. దాని కోసం వెతుకుతున్నాడు చిరు. అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమానే `ఖైదీ`.
`ఖైదీ` మూవీ చిరంజీవి లైఫేనే మార్చేసిన మూవీ
చిరంజీవి కెరీర్‌ని `ఖైదీ`కి ముందు `ఖైదీ` తర్వాత పిలుస్తుంటారు. అంతటి విజయాన్ని ఈ మూవీ సాధించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.
సంయుక్త మూవీస్ పతాకంపై కె ధనుంజయ రెడ్డి, కె నరసారెడ్డి, ఎస్ సుధాకర్ రెడ్డి నిర్మించారు. దీని వెనుక మరో నిర్మాత కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించారు.
అయితే ఇది హాలీవుడ్ మూవీ `ఫస్ట్ బ్లడ్` తెలుగు రీమేక్ అని చెప్పొచ్చు. ఆ కథ నుంచి ఇన్‌స్పైర్ అయి ఈ మూవీని రూపొందించారు.
పరుచూరి బ్రదర్స్ ఈ కథని రెడీ చేశారు. దర్శకుడు కోదండ రామిరెడ్డి దాన్ని అంతే బాగా తెరకెక్కించగా, ఇందులో హీరోగా చిరంజీవి రెచ్చిపోయి నటించాడు. తన విశ్వరూపం చూపించారు.
`ఖైదీ`తో బిగ్ స్టార్స్ దృష్టిలో చిరంజీవి, స్టార్ ఇమేజ్
యాక్షన్ డ్రామాగా 1983లో అక్టోబర్ 28న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ టైమ్‌లో పెద్దగా అంచనాలు లేవు. కానీ పోస్టర్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ఏదో ఉందనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
కానీ ఈ మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రారంభం షో నుంచే దుమ్మురేపింది. ఇండస్ట్రీని షేక్ చేసింది. అందరి దృష్టి దీనిపై పడేలా చేసింది.
ఈ మూవీ బాక్సాఫీసు వద్ద చేస్తున్న రచ్చ చూసి పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా షాక్‌లోకి వెళ్లారట. ఎవరా హీరో, ఏంటా మూవీ అంటూ ఆరా తీశారట. చిరంజీవి గురించి తెలుసుకున్నారట.
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `ఖైదీ` బడ్జెట్, కలెక్షన్లు
`ఖైదీ` మూవీ బాక్సాఫీసు వద్ద చేసిన రచ్చ కూడా వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ కేవలం రూ.25లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించారట. కానీ ఇది టోటల్‌గా రూ.8కోట్లు వసూలు చేసింది.
పెట్టిన ఖర్చుకి 32 టైమ్స్ ఎక్కువగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దెబ్బకి చిరంజీవి స్టార్ హీరో అయిపోయారు. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో మూవీస్ చేసేందుకు వెంటపడ్డారు.
`ఖైదీ` తర్వాత చిరంజీవి స్టార్ గా, సుప్రీమ్ స్టార్‌గా, సూపర్ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ ఆయన స్టార్ డమ్‌ని టచ్ చేసేవారే లేరని చెబితే అతిశయోక్తి కాదు.
`విశ్వంభర`, `మెగా 157` చిత్రాలతో చిరంజీవి బిజీ
ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అవుతుంది. దీపావళి సమయంలోగానీ, ఈ ఏడాది చివర్లోగానీ ఈ మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా 157` సినిమాలో నటిస్తున్నారు చిరు. ఇందులో వెంకీ గెస్ట్ గా కనిపించబోతున్నారు.
చిరు మార్క్ కామెడీ, యాక్షన్, డాన్సులతోపాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేళవింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు