MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్‌ సరికొత్త సునామీ ఆరంభం.. ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఫస్ట్ రోజే సంచలనం

ఎన్టీఆర్‌ సరికొత్త సునామీ ఆరంభం.. ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఫస్ట్ రోజే సంచలనం

Ntr-Neel Shooting: ఎన్టీఆర్‌ మొన్నటి వరకు `వార్‌ 2` చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు మరో సినిమాని షురూ చేశారు. సరికొత్త సునామీకి తెరలేపారు. ఆ కథేంటో ఇందులో చూద్దాం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 20 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ntr Neel movie

Ntr-Neel movie

Ntr-Neel Shooting: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. కొత్త సినిమా ప్రారంభించనున్నారు. ప్రశాంత్‌ నీల్‌తో చేయబోతున్న సినిమా నేడు(ఫిబ్రవరి 20)న ప్రారంభమయ్యింది.  మరో సంచలనానికి తెరలేపారు. ఆయన ప్రశాంత్ నీల్‌తో నటించబోతున్న సినిమాకి భారీ స్థాయిలో ప్రారంభం అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Ntr-Neel movie

Ntr-Neel movie

ఈ సినిమా షూటింగ్‌ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకమైన సెట్‌ వేసినట్టు తెలుస్తుంది. దాదాపు పది, పదిహేను రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. అయితే ఫస్ట్ డేనే భారీ స్థాయిలో యాక్షన్‌ సీన్లని చిత్రీకరణ చేయబోతున్నారు. సుమారు 1500 మంది జూ ఆర్టిస్ట్ లు ఇందులో పాల్గొంటారని సమాచారం. మొదటి రోజే ఓ భారీ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. 
 

34
Ntr-Neel movie

Ntr-Neel movie

ఈ వార్తతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక సునామీ మొదలు అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ అంటే మాస్‌ యాక్షన్ మూవీస్‌ కి కేరాఫ్‌. `కేజీఎఫ్‌`, `సలార్‌`తో తానేంటో నిరూపించారు. సరైన మాస్‌ హీరో పడితే ప్రశాంత్‌ నీల్‌ ఎలా చూపిస్తాడు, ఎలాంటి సినిమాని తీస్తారో చూపించారు. ఇప్పుడు వాటిని మించి ఆయన ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. గత చిత్రాలను మించి భారీ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
 

44
Ntr-Neel movie

Ntr-Neel movie

ఇక ఎన్టీఆర్‌ గతేడాది `దేవర` చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. మొన్నటి వరకు బాలీవుడ్‌ మూవీ `వార్‌ 2`లో నటించాడు. ఆ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇప్పుడు `ఎన్టీఆర్‌-నీల్‌` ప్రాజెక్ట్ లో జాయిన్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ తర్వాత కొంతగ్యాప్‌ ఇచ్చి మళ్లీ కంటిన్యూగా సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్‌ కన్నడ భామ రుక్మిణీ వసంత్‌  ఎంపికైనట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 

read  more: అకీరా నందన్‌ హీరోగా లాంచింగ్‌ డేట్‌ ఫిక్స్ ?, డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. నిర్మాత క్రేజీ ?

also read: అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved