MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?

Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?

Jana Nayagan Collections: సీఎం విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జననాయగన్ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే దుమ్ము దులిపేసింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. విజయ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంచలనం సృష్టించిన సీఎం గారి సినిమా..
Image Credit : KVN Productions

సంచలనం సృష్టించిన సీఎం గారి సినిమా..

కోలీవుడ్ స్టార్ హీరో, 'దళపతి' విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌తో ఘన విజయాన్ని సాధిస్తోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విడుదలయిన ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రాన్ని ఒక పండగలా వేడుక చేసుకుంటున్నారు. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సంచలనం సృష్టించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జననాయగన్ కు రికార్డు స్థాయిలో వసూళ్లు
Image Credit : Instagram

జననాయగన్ కు రికార్డు స్థాయిలో వసూళ్లు

బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు రాత్రి షోలు ముగిసే సమయానికి ఈ చిత్రం భారతదేశంలో అత్యంత రికార్డు స్థాయి నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో సింహభాగం తమిళనాడు నుంచే రావడం విజయ్‌కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి రుజువు చేసింది. తమిళ వెర్షన్‌లోనే 36.50 కోట్ల నెట్ వసూళ్ళతో అత్యధిక కలెక్షన్లు నమోదు కాగా, తెలుగు , హిందీ రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి స్పందన లభించింది.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు దాదాపు రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రాబట్టగా, హిందీ ల్యాండ్‌లో రూ. 1 కోటికి పైగా వసూళ్లను సాధించినట్టు సమాచారం. . భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 50 కోట్ల నెట్ మార్కును చేరుకునే దిశగా ఈ సినిమా వేగంగా దూసుకుపోతోంది.

Related Articles

Related image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Related image2
Nani: నేచురల్ స్టార్ ఏజ్ సీక్రెట్, వయసు కనిపించకుండా హీరో నాని ఏం చేస్తారో తెలుసా?
35
గ్లోబల్ మార్కెట్‌లో విజయ్ విధ్వంసం
Image Credit : Asianet News

గ్లోబల్ మార్కెట్‌లో విజయ్ విధ్వంసం

భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా దళపతి విజయ్ క్రేజ్ అసాధారణంగా ఉంది. విదేశీ మార్కెట్లలో నమోదైన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే, ‘జననాయగన్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే ఇది మరొక అత్యుత్తమ, గుర్తుండిపోయే ఓపెనింగ్‌గా నిలవనుంది.

45
లాంగ్ వీకెండ్‌పైనే కన్నేసిన దళపతి..
Image Credit : Asianet News

లాంగ్ వీకెండ్‌పైనే కన్నేసిన దళపతి..

తొలి రోజు వచ్చిన అద్భుతమైన టాక్, భారీ వసూళ్లతో ఇప్పుడు అందరి దృష్టి వీకెండ్ బాక్సాఫీస్ పైనే పడింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు కుటుంబ ప్రేక్షకుల  సపోర్ట్  తోడైతే, ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతూ ఇచ్చిన ఈ 'జననాయగన్' వినోదం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి

55
జన నాయగన్ లో ఎవరెవరు?
Image Credit : Asianet News

జన నాయగన్ లో ఎవరెవరు?

టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోత్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాలో విజయ్ దళపతి సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే యువ నటి మమితా బైజు, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. సినిమా కథలో పొలిటికల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, యాక్షన్, మరీ ముఖ్యంగా విజయ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
Related Stories
Recommended image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Nani: నేచురల్ స్టార్ ఏజ్ సీక్రెట్, వయసు కనిపించకుండా హీరో నాని ఏం చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved