MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Naga Babu Remuneration: చాలా కాలం తరువాత రీసెంట్ గా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఎంట్రీని ఎవరు ఊహించలేదు కూడా. మెగా బ్రదర్ రావడంతో షోకి కొత్త కళ వచ్చేసింది. ఈక్రమంలో ఆయన రీ ఎట్రీలో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2026, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుల్లితెరపై కామెడీ సంచలనం..
Image Credit : our own

బుల్లితెరపై కామెడీ సంచలనం..

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎంతో మంది మారుమూలన ఉన్న కళాకారులు, కమెడియన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నారు. ఈ షో సక్సెస్ లో కమెడియన్స్ పాత్ర ఎంత ఉందో.. జడ్జిల పాత్ర కూడా అంతే ఉంది. మరీ ముఖ్యంగా నటుడు, నిర్మాత నాగబాబు పాత్ర అత్యంత కీలకమైనది. రోజా, నాగబాబుల జోడీ జబర్దస్త్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే, కొన్నేళ్ల కిందట ఆయన ఈ షో నుంచి బయటకు రావడం తో షో రేటింగ్ పడిపోతూ వచ్చాయి. తాజాగా నాగబాబు రీ ఎంట్రీతో మళ్లీ జబర్దస్త్ కు పూర్వ వైభవం వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లిపోయారు?
Image Credit : our own

జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లిపోయారు?

నాగబాబు జబర్దస్త్ వీడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ షోనుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఓ వీడియో ద్వారా అసలు విషయాలను ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రధానంగా ఈ కామెడీ షో నిర్వాహకులైన 'మల్లెమాల ప్రొడక్షన్స్' తో వచ్చిన విబేధాలు, ఆర్టిస్టుల పారితోషికాలు, వర్కింగ్ కండిషన్స్, టెక్నీషియన్ల పట్ల ప్రదర్శించే వైఖరి సరిగ్గా లేవని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. షోను నిలబెట్టిన కమెడియన్లకు తగిన గుర్తింపు, ఆదరణ దక్కడం లేదని భావించి, వారికి సపోర్ట్ గా ఆయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇతర కామెడీ షోలలో జడ్జిగా వ్యవహరించడం, పొలిటికల్ కెరీర్‌పై దృష్టి పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు.

34
నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ, షో పై ప్రభావం..
Image Credit : etv

నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ, షో పై ప్రభావం..

కొన్నేళ్లుగా జబర్దస్త్ టిఆర్పి (TRP) రేటింగ్స్ భారీగా క్షీణిస్తూ వచ్చాయి. పాత కమెడియన్లు వెళ్లిపోవడం, కొత్త ఫార్మాట్లు రావడం వల్ల షో క్రేజ్ కొంత తగ్గింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ టీమ్ ఈ షోకి ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని పట్టుదలతో.. నాగబాబును మళ్లీ జబర్దస్త్‌లోకి ఆహ్వానించారు. ఆయన రీ ఎంట్రీతో జబర్దస్త్‌కు మళ్లీ కొత్త జోష్ వచ్చింది. పాత రోజు నాటి సరదా వాతావరణం, నాగబాబు విలక్షణమైన నవ్వు ప్రేక్షకాదరణ పొందుతుండటంతో.. జబర్దస్త్ రేటింగ్స్‌లో పెరుగుదల కనిపిస్తోంది.

44
నాగ బాబు రెమ్యునరేషన్ ఎంత?
Image Credit : our own

నాగ బాబు రెమ్యునరేషన్ ఎంత?

నాగబాబు రీ ఎంట్రీలో భారీ పారితోషికం తీసుకుంటున్నారనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం.. నాగబాబు ప్రతి ఎపిసోడ్‌కు లేదా నెలవారీ ప్రాతిపదికన భారీ మొత్తాన్నే అందుకుంటున్నారు. గతంలో ఒక ఎపిసోడ్‌కు సుమారు రూ. 5 లక్షల వరకూ తీసుకున్నారని.. ప్రస్తుతం 10 నుంచి 15 లక్షల వరకూ అందుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇది బయట వినిపిస్తున్నటాక్ మాత్రమే.. దీనిపై మల్లెమాల యాజమాన్యం గానీ, నాగబాబు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Recommended image2
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Recommended image3
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్, చిరంజీవి ఇద్దరికి ఫేవరెట్ హీరోయిన్, మామ,అల్లుడు డ్యాన్స్ చేయాలని మనసుపడ్డ బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved