- Home
- Entertainment
- అకీరా నందన్ హీరోగా లాంచింగ్ డేట్ ఫిక్స్ ?, డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్.. నిర్మాత క్రేజీ ?
అకీరా నందన్ హీరోగా లాంచింగ్ డేట్ ఫిక్స్ ?, డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్.. నిర్మాత క్రేజీ ?
Akira Nandan Entry: పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన అదిరిపోయే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. డైరెక్టర్, నిర్మాత ఎవరో తెలిసిపోయింది.

Pawan Kalyan and Akira Nandan
Akira Nandan Entry: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసే స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తే చాలు అనే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉంటున్నారు. సినిమాలు చేసే టైమ్ దొరకడం లేదు.
ఈ క్రమంలో ఆయన ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక కొత్తగా మూవీస్ చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో యంగ్ పవర్ స్టార్ రాబోతున్నారు. అకీరా నందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Akira Nandan Entry:
అకీరా నందన్ ఇటీవల తరచూ పవన్ కళ్యాణ్ వెంట కనిపిస్తున్నాడు. ఏపీలో ఎన్నికల టైమ్ నుంచి ఇది కొనసాగుతుంది. మొన్న మహా కుంభమేళాలోనూ అకీరా నందన్, భార్యతో కలిసి వెళ్లారు పవన్. ఇందులో అకీరా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
ఆయన హైలైట్, లుక్ అదిరిపోయింది. కరెక్ట్ గా ఫిజిక్‌పై ఫోకస్ పెడితే అదిరిపోయే కటౌట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అకీరా సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించిన ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడెప్పుడు హీరోగా పరిచయం అవుతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
trivikram srinivas
ఇదిలాఉంటే అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన హీరోగా పరిచయానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలిసింది. అయితే నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నాగవంశీకి అప్పగించారట పవన్.
అలాగే హీరోగా పరిచయం చేసే బాధ్యతలను దర్శకుడు త్రివిక్రమ్ కి అప్పగించారట. త్రివిక్రమ్, నాగవంశీ, సితార అంతా ఒకే కాంపౌండ్. అది పవన్‌కి సొంత బ్యానర్‌గా భావించే కాంపౌండ్ కావడం విశేషం. అందుకే అకీరా బాధ్యతలను వారికే అప్పగించారట పవన్.
Akira Nandan Entry:
2027లో అకీరాని హీరోగా పరిచయం చేయబోతున్నారట. ఈ రెండేళ్లు ఆయన యాక్టింగ్, ఫిజిక్ పరంగా ట్రైన్ కాబోతున్నారని తెలుస్తుంది. నటన, మార్షల్ ఆర్ట్స్, డాన్సులు ఇలా అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్ గా ట్రైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని రకాలుగా సిద్ధమయ్యాక అకీరా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు.
read more: `పుష్ప 2` దెబ్బకి `హాలీవుడ్ రిపోర్టర్`పైకి అల్లు అర్జున్.. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక హీరో
also read: అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!