- Home
- Entertainment
- అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!
అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!
Anushka Shetty: అనుష్క శెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది. అలాంటి ఇమేజ్ ఉన్న అనుష్క ఓ సీరియల్‌లో మెరిసింది. మరి ఆమె నటించిన సీరియల్ ఏంటి? ఆ కథేంటో ఇందులో చూద్దాం.

Anushka Shetty
Anushka Shetty: తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, ఆమెని ఆరాధించే, అభిమానించే ప్రతి ఒక్కరు అనుష్క శెట్టిని స్వీటి అనే పిలుస్తారు. పేరుకే స్వీటి కాదు, ఆమె మనసు కూడా అంతే స్వీటీగా ఉంటుంది. అద్భుతమైన నటనతో మ్యాజిక్ చేసే అనుష్క మనసు మాత్రం వెన్న. అదే ఆమెని తిరుగులేని హీరోయిన్‌ని చేసింది. లేడీ సూపర్ స్టార్‌ని చేసిందని చెప్పొచ్చు.
Anushka Shetty
`సూపర్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత వరుసగా పలు బిగ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రారంభంలో గ్లామర్ హీరోయిన్‌గా కనిపించినా, ఆ తర్వాత `అరుంధతి` నుంచి తనని తాను మార్చుకుంది. అద్బుతమైన నటిగా తీర్చుదిద్దుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తుంది. హీరోయిన్లలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క సినిమాలే కాదు, ఓ సీరియల్‌లో కూడా కనిపించింది. మరి అనుష్క నటించిన సీరియల్ ఏంటో చూస్తే.
anushka shetty (photo credit-maa tv)
అనుష్క `యువ` అనే సీరియల్‌లో తళుక్కున మెరిసింది. ఇందులో నటుడు వాసుకి ఆమె లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించింది. 2007లో ఈ సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఇందులో రష్మి, కరాటే కళ్యాణి, వాసు, కృష్ణుడు వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. మూడు జంటలు కలిసి జీవిస్తుంటారు. వారి లవ్, ఫన్ ప్రధానంగా ఈ సీరియల్‌ని రూపొందించారు.
anushka shetty (photo credit-maa tv)
ఈ సీరియల్‌కి రాఘవేంద్రరావు వద్ద `శ్రీరామదాసు`కి పని చేసిన డైరెక్ట్ చేశారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలోనే దీన్ని రూపొందించారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మించడం విశేషం. ఇందులో రష్మికి లవ్ ఇంట్రెస్ట్ గా రాజమౌళి కూడా నటించడం విశేషం. ఇక ఈ సీరియల్‌లో అనుష్క గెస్ట్ రోల్ చేసింది. వాసు పాత్రకి లవర్‌గా నాగలక్ష్మి పాత్రలో కాసేపు మెరిసింది. కేఫ్‌లో మూడు జంటలు ఉన్నప్పుడు వాసు తన అనుష్కని వారికి పరిచయం చేస్తారు. ఆమెని చూసి రష్మి, ఇతర లేడీ ఆర్టిస్ట్ లు జెలసీ ఫీలవ్వడం ఇందులో విశేషం.
rajamouli, nagarjuna
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఈ సీరియల్ తెరవెనుక రాజమౌళి, నాగార్జున, రాఘవేంద్రరావులు ఉండటంతో వారితో అనుష్క కి ఉన్న అనుబంధంతో ఈ సీరియల్ లో ఆమె నటించిందని తెలుస్తుంది. కానీ కాసేపు ఓ మెరుపులా వచ్చి వెళ్లింది స్వీటి.
Anushka Shetty
అనుష్క శెట్టి చివరగా నవీన్ పొలిశెట్టితో కలిసి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాలో నటించింది. అది డీసెంట్ హిట్ అయ్యింది. ఇప్పుడు `ఘాటి` అనే సినిమాలో నటిస్తుంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇందులో అనుష్క విలన్లు పరా పరా కోయడం హైలైట్‌గా నిలిచింది. అనుష్క ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి.
read more: 75ఏళ్ల నటుడితో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్.. రిస్క్ చేయడం కాదు, లక్కీ ఛాన్స్ !