MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Thammudu Collections: నితిన్‌ `తమ్ముడు` ఫస్డ్ డే కలెక్షన్లు.. అస్సలు ఊహించరు

Thammudu Collections: నితిన్‌ `తమ్ముడు` ఫస్డ్ డే కలెక్షన్లు.. అస్సలు ఊహించరు

నితిన్‌ హీరోగా రూపొందిన `తమ్ముడు` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 05 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లలో సందడి చేస్తోన్న `తమ్ముడు`
Image Credit : x/production house

థియేటర్లలో సందడి చేస్తోన్న `తమ్ముడు`

నితిన్‌ హీరోగా లేటెస్ట్ గా `తమ్ముడు` అనే చిత్రం వచ్చింది. `వకీల్‌ సాబ్‌` ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని దిల్‌ రాజు, శిరీష్‌ రెడ్డి సంయుక్తంగా ఎస్‌వీసీ పతాకంపై నిర్మించారు.

 ఇందులో సీనియర్‌ నటి లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక ముఖ్య పాత్రలు పోషించారు. సౌరభ్‌ సచదేవ నెగటివ్‌ రోల్‌ చేసిన ఈ మూవీ ట్రైలర్స్ తో ఆకట్టుకుంది. సినిమాపై భారీ హైప్‌ వచ్చింది. దీనికితోడు దిల్‌ రాజు కామెంట్స్ కూడా ఈ మూవీపై బజ్‌ పెరగడానికి కారణమని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`తమ్ముడు` చిత్రానికి మిశ్రమ స్పందన
Image Credit : x/production house

`తమ్ముడు` చిత్రానికి మిశ్రమ స్పందన

వరుస పరాజయాలతో ఉన్న నితిన్‌ `తమ్ముడు` సినిమాతో కమ్‌ బ్యాక్‌ కావాలని, ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. 

చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. మరి ఈమూవీకి ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, చాలా వరకు డల్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో మొదటి రోజు వసూళ్ల వివరాలు ప్రముఖ ట్రేడ్‌ సైట్లు వెళ్లడించాయి. ఈ మూవీ తొలి రోజు ఆశించిన దానికంటే తక్కువే వచ్చాయి.

35
`తమ్ముడు` మూవీ తొలి రోజు వసూళ్లు
Image Credit : x/production house

`తమ్ముడు` మూవీ తొలి రోజు వసూళ్లు

ట్రేడ్‌ వర్గాల నుంచి తెలుస్తోన్న సమాచారం ప్రకారం `తమ్ముడు` మూవీ తొలి రోజు రూ.3 కోట్ల వరకు వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. 

సినిమాపై ఉన్న బజ్‌కి, అడ్వాన్స్ బుకింగ్స్ తో పోల్చితే ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. 

అంతేకాదు ఇటీవల కాలంలో నితిన్‌ కెరీర్‌లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. కాంట్రవర్సీలు, హైప్‌ ఏది ఓపెనింగ్స్ కలెక్షన్ విషయంలో ప్రభావం చూపించలేకపోయాయి.

45
`తమ్ముడు` మూవీ బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు
Image Credit : x/production house

`తమ్ముడు` మూవీ బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు

ఇక `తమ్ముడు` సినిమా బిజినెస్‌ చూస్తే ఈ చిత్రానికి సుమారు రూ..75కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. కాకపోతే దర్శకుడు వేణు శ్రీరామ్‌, హీరో పారితోషికం తీసుకోకుండా వర్క్ చేశారు.

 దీంతో నిర్మాత దీనికి సుమారు యాభై కోట్లు పెట్టారట. అయితే బిజినెస్‌ పరంగా రికవరీ బాగానే ఉంది. ఈ మూవీని అమెజాన్‌ ప్రైమ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

దీనికి రూ.20కోట్ల వచ్చాయట. అలాగే శాటిలైట్‌ రూ.15 కోట్లు, మ్యూజిక్‌ రైట్స్ కోటి వరకు వచ్చాయని సమాచారం. మరోవైపు థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా బాగానే అయ్యిందట. 

తెలుగు స్టేట్‌ రైట్స్ రూ.20కోట్లకు అమ్ముడు పోయాని, ఇతర స్టేట్స్, ఓవర్సీస్‌ రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఇదే నిజమైతే నిర్మాత చాలా వరకు సేఫ్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. కానీ సినిమాని కొన్న బయ్యర్లకే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

55
వరుస పరాజయాల్లో నితిన్‌
Image Credit : x/production house

వరుస పరాజయాల్లో నితిన్‌

నితిన్‌ చివరగా `భీష్మ` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన `చెక్‌`, `రంగ్‌ దే`, `మాచర్ల నియోజకవర్గం`, `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌`, `రాబిన్‌హుడ్‌` చిత్రాలు పరాజయం చెందాయి. 

ఓటీటీలో వచ్చిన `మ్యాస్ట్రో` ఫర్వాలేదనిపించింది. కానీ థియేటర్లో వచ్చిన అన్ని సినిమాల నిరాశపరిచయాయి. మరి ఇప్పుడు `తమ్ముడు` కూడా ఆ స్థానంలో చేరుతుందా? గట్టెక్కుతుందా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దిల్ రాజు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(118.2 ov)414/8
Day 3 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: పీరియడ్స్ వచ్చినా ఆపరు.. బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి దక్షి వెల్లడించిన షాకింగ్ నిజాలు..
Recommended image2
Puneeth Rajkumar Death Anniversary: పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 5 ఏళ్లు.. భార్య అశ్విని ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Related Stories
Recommended image1
సౌందర్య ప్రేమించిన సీక్రెట్‌ పర్సన్ ఎవరో తెలుసా? సినిమాలకు సంబంధం లేదు.. స్టార్‌ హీరోయిన్‌ మనసులో మాట
Recommended image2
`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి, ఎన్ని కోట్లకు తీసుకున్నారో తెలుసా? చాలా పెద్ద రిస్క్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved