- Home
- Entertainment
- సౌందర్య ప్రేమించిన సీక్రెట్ పర్సన్ ఎవరో తెలుసా? సినిమాలకు సంబంధం లేదు.. స్టార్ హీరోయిన్ మనసులో మాట
సౌందర్య ప్రేమించిన సీక్రెట్ పర్సన్ ఎవరో తెలుసా? సినిమాలకు సంబంధం లేదు.. స్టార్ హీరోయిన్ మనసులో మాట
సౌందర్య కొందరు హీరోలతో లవ్ ట్రాక్ నడిపించిందనే టాక్ వినిపించింది. కానీ ఆమె మనసులో ఉన్నది వీళ్లెవరూ కాదు. మరి ఆ సీక్రెట్ పర్సన్ ఎవరో తెలుసుకుందాం.

ఆ హీరోలతో సౌందర్య ఎఫైర్స్ నిజం కాదా?
సినిమా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకి సంబంధించిన పుకార్లు రావడం సర్వసాధారణమే. సౌందర్య విషయంలోనూ అలాంటి రూమర్లు వచ్చాయి. ప్రధానంగా జగపతిబాబుతో ఎక్కువగా గాసిప్స్ వినిపించాయి.
వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని, పిల్లల్ని కనాలనుకున్నారనే టాక్ వచ్చింది. ఇద్దరు క్లోజ్‌గా ఉండటం, కలిసి సినిమాలు చేయడం, కలిసి కనిపించడం వంటి కారణాలతో ఈ పుకార్లు వచ్చాయని చెప్పొచ్చు.
దీనిపై జగపతిబాబు చాలా సార్లు స్పందించారు. తాము మంచి ఫ్రెండ్స్ అనే చెప్పారు. అలాగే హీరో వెంకటేష్, సౌందర్యకి మధ్య కూడా ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లారని అంటుంటారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రఘుని పెళ్లి చేసుకున్నసౌందర్య
సౌందర్య మాత్రం సినిమాలకు దూరంగా, సినిమాలకు సంబంధం లేని వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. 2003లో సౌందర్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీ ఎస్ రఘుని పెళ్లి చేసుకుంది. ఆయన సౌందర్య చిన్ననాటి స్నేహితుడు అని, వారికి బంధువు కూడా అని సమాచారం.
మ్యారేజ్ తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె విమాన ప్రమాదంలో కన్నుమూయడం అత్యంత బాధాకరం. అయితే ఆమె మరణించే నాటికి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా బయటకు వచ్చింది.
సౌందర్య రహస్య ప్రేమ కథ
కానీ సౌందర్య ప్రేమించింది మరో వ్యక్తిని అట. తమ బంధువుల అబ్బాయినే ప్రేమించిందట. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుందట.
సౌందర్య ప్రేమ కథకి సంబంధించిన బయటకు రాని ఓ రహస్యమైన విషయాన్ని సీనియర్ నటి నిర్మల వెల్లడించారు. సౌందర్య మనసులోని మాటని ఆమె ఆవిష్కరించారు.
సౌందర్య సినిమాల స్టార్స్ తో ప్రేమలో ఉందనే రూమర్స్ వచ్చాయి, కానీ అవన్నీ నిజం కాదని, ఆమె ప్రేమించింది వేరే వ్యక్తిని అని చెప్పింది. ఆయన ఎవరో కాదు సొంత మేనమామనే అట. తన అమ్మ సోదరుడినే సౌందర్య ఇష్టపడిందట.
మేనమామని ఇష్టపడ్డ సౌందర్య
వెంకటేష్‌తో నటించిన `జయం మనదేరా` సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్‌కి వెళ్లారట. అక్కడకి సౌందర్య అమ్మ రాలేదు. సెట్‌లో సీనియర్ నటి నిర్మల ఉన్నారు.
దీంతో ఆమెతో క్లోజ్‌గా మూవ్ అయ్యారట సౌందర్య. ఆ సమయంలోనే లోలోపల పాట పడుతూ జాలీగా కనిపించారట. ఏ దొంగ ఏదో రహస్యం దాస్తున్నారని అడగ్గా, అసలు విషయాన్ని బయటపెట్టిందట సౌందర్య.
అప్పుడు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందట. తాను ప్రేమిస్తున్నది ఎవరో కాదు, తన మేనమామనే అని చెప్పిందట. అమ్మ తమ్ముడితోనే ప్రేమలో ఉందట.
అంతేకాదు సౌందర్యలో చాలా డ్రీమ్స్ ఉన్నాయట. పిల్లలు కనడం, లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి వంటివన్నీ నటి నిర్మలతో సౌందర్య చర్చించిందట.
ఆమె జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుందని తెలిపింది నటి నిర్మల. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్‌గా ఎదిగిన సౌందర్య
కర్నాటకకు చెందిన సౌందర్య తన 10వ తరగతి పూర్తి చేయగానే సినిమాల్లోకి వచ్చింది. ఓ మూవీలో చిన్న పాత్ర కోసం సౌందర్యని నటింపచేశారు తండ్రి.
ఆయన నిర్మాతగా కన్నడలో పలు సినిమాలు నిర్మించారు. సౌందర్యకి సినిమాలంటే ఇష్టం లేదు, కానీ తండ్రి ఒత్తిడి మేరకు నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. అందులోనే కంటిన్యూ అయ్యింది.
తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక్కడ అందరు హీరోలతోనూ కలిసి నటించి మెప్పించింది. చీరకు అందం తెచ్చేలా ఆమె కట్టుబొట్టుతో ఆకట్టుకుంది.
గ్లామర్ కి దూరంగా ఉంటూ అభినయంతోనే మంత్రముగ్దుల్ని చేసింది సౌందర్య. ఆమె మరణించి 21ఏళ్లు అవుతున్నా, తన సినిమాలతో అలరిస్తూనే ఉంది సౌందర్య.