తల్లీ తండ్రుల పేర్లు పచ్చబొట్టు వేయించుకున్న యంగ్ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
ఓ టాలీవుడ్ యంగ్ హీరో తన మరణించిన తన తండ్రిపై వెలకట్టలేని ప్రేమను చాటుకున్నాడు. తండ్రితో పాటు తల్లి పేరును కూడా త ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇంతకీ ఆ యంగ్ స్టార్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ స్టార్స్ ఉన్నారు. కాని ఎవరి ప్రత్యేకత వారిది. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్స్ గా మారిన వారు కూడా లేకపోలేదు. సొంత టాలెంట్ తో సినిమాల్లోకి వచ్చి మీడియమ్ రేంజ్ హీరోగా ఎదిగిన ఓ హీరో, తన తల్లీ తండ్రుల పేర్లను పంచ్చబొట్టు వేయించుకుని, వారిపై ప్రేమను చాటుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.
టాలీవుడ్‌లో మిడిల్ రేంజ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న నటుడిగా ఎదిగారు. రీసెంట్ గా నిఖిల్ చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నపిల్లాడిగా ఎంత క్యూట్ గా ఉన్నాడో, హీరోగా ఎదిగిన తరువాత అంత హ్యాండ్సమ్ గా తయారయ్యాడు నిఖిల్. ప్రతీ సినిమాకు తన స్టైల్ ను ఛేంజ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు యంగ్ హీరో.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నిఖిల్, స్టడీస్ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) నుంచి స్కూలింగ్ పూర్తి చేసిన ఆయన, MJ College నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టిన నిఖిల్, ఆ తర్వాత హీరోగా మారారు. తొలి సినిమాల ద్వారా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, హ్యాపీడేస్ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. పలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్.
అత్యధిక వసూళ్లు సాధించిన 'కార్తికేయ 2' వంటి డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పలు కీలక ప్రాజెక్టుల్లో నటించేందుకు అవకాశాలు కూడా నిఖిల్ ను వరించాయి. ప్రస్తుతం నిఖిల్ తన 20వ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నభా నటేష్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.
ఇక మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ఇండియా హౌస్' లో కూడా నిఖిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్లలోకి రానుండటంతో నిఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక నిఖిల్ వ్యక్తిగత జీవితంలో చూసుకుంటే ఆయనకు తన తండ్రి అంటే ప్రాణం, తల్లిదండ్రులకు నిఖిల్ చాలా విలువ ఇస్తారు. తన ప్రేమను అందరికంటే డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. రీసెంట్ గా నిఖిల్ తండ్రి శ్యామ్, తల్లి వీణ పేర్లను తన వీపుపై టాటూ రూపంలో చెరిపోని గుర్తుగా వేసుకోవడం విశేషం. ఇక నిఖిల్ తండ్రి శ్యామ్ 2022లో అరుదైన వ్యాధితో మరణించారు.

