MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: సుమిత్ర సేఫ్-జ్యోతో పారు అబద్ధం- కడుపులో బిడ్డపై వీడని సస్పెన్స్

Karthika Deepam 2 Today Episode: సుమిత్ర సేఫ్-జ్యోతో పారు అబద్ధం- కడుపులో బిడ్డపై వీడని సస్పెన్స్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 21వ తేదీ)లో కడుపులో బిడ్డ గురించి దీప, కార్తీక్ బాధ. సుమిత్ర సేఫ్ అని చెప్పిన డాక్టర్. జ్యోతో అబద్ధం చెప్పిన పారు. శౌర్య విషయంలో జ్యో, పారులకు కార్తీక్ వార్నింగ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 21 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్‌లో దీప కళ్లు తెరవగానే ఎలా ఉందని అడుగుతాడు కార్తీక్. బాగేనే ఉంది. ఆపరేషన్ అయిపోయింది కదా.. ఇక ఆ బొమ్మ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటుంది దీప. మన బిడ్డతో రుణం పుట్టకముందే తీరిపోయింది. అత్త బ్రతికింది అది చాలు. అన్నీ వదిలేసి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అంటాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అబద్ధం చెప్పిన పారు
Image Credit : Jiohotstar

అబద్ధం చెప్పిన పారు

మరోవైపు జ్యోత్స్న దగ్గరికి వెళ్లి ఎలా ఉందని అడుగుతుంది పారిజాతం. అంతా అయోమయంగా ఉంది. సర్జరీ అయిపోయిందట అంటుంది జ్యోత్స్న. నువ్వే సుమిత్ర కూతురివి కాబట్టి ఆపరేషన్ చేశారు అంటుంది పారు. నీతో వాదించే ఓపిక నాకు లేదు. దీప ఎక్కడుంది? ఆపరేషన్ టైంలో నువ్వు తనని జాగ్రత్తగా గమనించావా అని అడుగుతుంది జ్యోత్స్న.

దాసును కలిశాను అంటే నన్ను చంపేస్తుంది అని మనుసులో అనుకొని, నేను దీప గదిముందే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది పారు. అంటే నేనే సుమిత్ర నిజమైన కూతురుని అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. బావ వచ్చాడా అని అడుగుతుంది జ్యోత్స్న. వచ్చాడు, శౌర్యను సేఫ్ చేశాడు. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు అని చెప్తుంది పారు. అంతలో కార్తీక్ లోపలికి వస్తాడు.

పెద్ద మేడం చేసిన పని గురించి మీడియా ముందు చెప్పాలని ఉంది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చేసింది మామూలు పని కాదు అంటాడు కార్తీక్. మేమేం తప్పు చేశాము అంటుంది పారు. పని అన్నాను కానీ.. తప్పు అనలేదు కదా.. నీకు ఎందుకో అంత భయం అంటాడు కార్తీక్. మీరు ముందు రెస్ట్ తీసుకొండి పెద్దమేడం.. మీకు ఎక్కడ ఎలా సన్మానం చేయాలో నేను ప్లాన్ చేస్తాను కదా అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

35
సుమిత్ర సేఫ్
Image Credit : Jiohotstar

సుమిత్ర సేఫ్

మరోవైపు దశరథ, శివన్నారాయణతో సుమిత్ర సేఫ్ అని చెప్తుంది డాక్టర్. అంతా దశరథ గారి కూతురే చేసింది. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే అంటుంది డాక్టర్. స్పృహలోకి రాగానే సుమిత్రను చూడొచ్చు అంటుంది డాక్టర్. దీప ఎక్కడ ఉందని అడుగుతాడు దశరథ. సుమిత్రను కాపాడింది దీప కాదు జ్యోత్స్న, నువ్వు చూడాల్సింది జ్యోత్స్నను అంటుంది పారిజాతం. 

బిడ్డను వదిలించుకోవాలకున్న ఆడదాని గురించి ఎందుకు అంత ఆరాటం. అలాంటి దాని మొహం కూడా చూడకూడదు అంటుంది పారు. దశరథ పిన్ని అని గట్టిగా అరుస్తాడు. దీప గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి వెళ్లిపోతాడు. తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకుందామా పారు అంటాడు కార్తీక్. వామ్మో వీడు శౌర్య విషయం బయటపెట్టేలా ఉన్నాడు అని వద్దు అంటుంది పారు.

45
దశరథ బాధ
Image Credit : Jiohotstar

దశరథ బాధ

మరోవైపు దీప దగ్గరికి వెళ్లి బాధపడుతాడు దశరథ. నా కూతురికి ఏం న్యాయం చేశాను. తను ఏం కోల్పోతే నా భార్య బ్రతికిందో ఎవరికి తెలుసు. ఇప్పుడు కూడా తల్లి బ్రతికిందని సంతోషపడుతోంది కానీ.. బిడ్డ గురించి ఆలోచించడం లేదు. నేను మాత్రం ఆశలు వదులుకోను అంటాడు దశరథ. దేవుడికి అన్నీ తెలుసు మావయ్య. ఇచ్చిన దాంతోనే మనం సరిపెట్టుకోవాలి అంటాడు కార్తీక్.

శివన్నారాయణ వచ్చి నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావ్ దశరథ. అది వాళ్లు తీసుకున్న నిర్ణయమే కదా.. అక్కడ ఓ ప్రాణం నిలబడింది, ఇక్కడో ప్రాణం పోయింది అంటాడు శివన్నారాయణ. కొన్ని త్యాగాలకు గుర్తింపు దక్కదు నాన్న అంటాడు దశరథ. తర్వాత సుమిత్ర స్పృహలోకి వచ్చిందని చెప్పగానే అందరూ అక్కడికి వెళ్తారు.

55
జ్యోత్స్న ఎలా ఉంది?
Image Credit : Jiohotstar

జ్యోత్స్న ఎలా ఉంది?

నేను బ్రతికానండి. నా కూతురే నన్ను కాపాడిందండి. ఇప్పుడు తను ఎలా ఉందని అడుగుతుంది సుమిత్ర. బాగానే ఉంది అటాడు దశరథ. దీప గురించి అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడు అవన్నీ ఎందుకు. నువ్వు క్షేమంగా ఉన్నావు. నా భార్య క్షేమంగా ఉంది. అది చాలు మాకు. ఇక నీకు ఏం కాదు అంటాడు కార్తీక్. తర్వాత అంతా జ్యోత్స్ను చూడడానికి వెళ్తారు. దాసు సుమిత్రతో ఉంటాను వదినా, ఇక నీకు ఏం కాదు అంటాడు దాసు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
3rd Week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్, 15 లక్షలతో మిథిలేష్‌ జంప్‌.. లక్‌ అంటే వీళ్లదే
Recommended image2
Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, వంశీ ఔట్‌..? ఆమె జస్ట్ లో మిస్‌ ?
Recommended image3
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:పారుతో ఓ రేంజ్‍లో ఆడుకున్న కార్తీక్-ఆపరేషన్ సక్సెస్-బిడ్డ బతికిందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved