MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..

Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..

డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్‌తో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కమల్ హాసన్ ఓపెన్‌గా వెల్లడించారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? విశేషాలేంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 21 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజినీకాంత్ కమల్ సినిమా..
Image Credit : youtube

రజినీకాంత్ - కమల్ సినిమా..

సౌత్ సినిమాలో  ఇద్దరు దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించి చాలా కాలం అవుతోంది.  వీరు మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తారా? అనే ప్రశ్న చాలా కాలంగా అభిమానుల్లో ఉంది. వీరిద్దరూ తమ నటన, స్టైల్, కథల ఎంపికతో దశాబ్దాలుగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించినా, చాలా కాలంగా వేర్వేరుగా సినిమాలు చేస్తున్నారు.

24
అభిమానులు ఎదురుచూపులు..
Image Credit : X

అభిమానులు ఎదురుచూపులు..

అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబో ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో ఇద్దరూ స్టైలిష్‌గా కనిపించారు. ముఖ్యంగా రజినీ కారు కీని కమల్ వైపు విసరడం, ఆ తర్వాత 'ఇందులో హీరో ఎవరు?' అనే ప్రశ్న రావడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

Related Articles

Related image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Related image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
34
యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన కథ
Image Credit : Red Giant Movies, X

యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన కథ

ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలగలిపిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంటున్నారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో  ఇప్పటి వరకూ రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా లేదన్న లోటును ఈ చిత్రం తీరుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రోమోలో 'ఇందులో హీరో ఎవరు?' అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్టైల్‌గా ముగించడం అభిమానులను ఆకట్టుకుంది.

44
కమల్ హాసన్ ఓపెన్ కామెంట్స్..
Image Credit : youtube

కమల్ హాసన్ ఓపెన్ కామెంట్స్..

ఇదే విషయంపై కమల్ హాసన్ రీసెంట్ గా మీడియా సమావేశంలో మాట్లాడారు. రజినీతో సినిమా గురించి అడగ్గా.. 'రజినీతో నేను కలిసి నటించే సినిమా షూటింగ్ ఎన్నికల తర్వాతే మొదలవుతుంది. నాకు ఎన్నికల పనులు ఉన్నాయి' అని స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం 'అవల్ అప్ప', '16 వయదినిలే' వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు, ఆ తర్వాత కలిసి నటించకపోవడం అభిమానులకు ఎప్పుడూ ఒక లోటుగానే ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సుమిత్ర సేఫ్-జ్యోతో పారు అబద్ధం- కడుపులో బిడ్డపై వీడని సస్పెన్స్
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Recommended image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved