MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • కమిటీ కుర్రోళ్ళు తర్వాత మరో హిట్ పై కన్నేసిన నిహారిక కొణిదెల.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా కొత్త మూవీ లాంచ్

కమిటీ కుర్రోళ్ళు తర్వాత మరో హిట్ పై కన్నేసిన నిహారిక కొణిదెల.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా కొత్త మూవీ లాంచ్

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

35
Image Credit : Asianet News

ఫ్యాంటసీ, కామెడీ జోనర్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్  ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీకి విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు. 

45
Image Credit : Asianet News

కమిటీ కుర్రోళ్ళు చిత్రం తర్వాత నిహారిక నిర్మిస్తున్న రెండవ చిత్రం ఇది. కమిటీ కుర్రోళ్ళు చిత్రం సూపర్ హిట్ అయింది. దీనితో నిర్మాతగా నిహారిక రెండో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మ్యాడ్ చిత్రంతో హీరో సంగీత్ శోభన్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

55
Image Credit : Asianet News

నటీనటులు:

సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి(జబర్దస్త్), రోహన్ (#90).

సాంకేతిక బృందం :

బ్యానర్ - పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, కథ - మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ & మహేష్ ఉప్పాల, ప్రొడ్యూసర్ - నిహారిక కొణిదెల, దర్శకత్వం - మానస శర్మ, మ్యూజిక్ - అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ - విజయ్, ఎడిటర్ - అన్వర్ అలీ

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
Recommended image2
స్నేహితుడిని ఆదుకునేందుకు చిరంజీవి చేసిన గొప్ప పని.. షూటింగ్ ఆపేసి, రెమ్యునరేషన్ కూడా అవసరం లేదు అంటూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved