- Home
- Entertainment
- స్నేహితుడిని ఆదుకునేందుకు చిరంజీవి చేసిన గొప్ప పని.. షూటింగ్ ఆపేసి, రెమ్యునరేషన్ కూడా అవసరం లేదు అంటూ
స్నేహితుడిని ఆదుకునేందుకు చిరంజీవి చేసిన గొప్ప పని.. షూటింగ్ ఆపేసి, రెమ్యునరేషన్ కూడా అవసరం లేదు అంటూ
చిరంజీవి స్నేహానికి విలువిచ్చే మనిషి అని ఒక సీనియర్ హీరో అన్నారు. తాను ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయం తనని భావోద్వేగానికి గురిచేసింది అని ఆయన పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో చాలామంది స్నేహితులు ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా చిరంజీవికి మంచి మిత్రులు ఉన్నారు. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్, చిరంజీవి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరూ గ్యాంగ్ లీడర్ చిత్రంలో కలిసి నటించారు.
ఓ ఇంటర్వ్యూలో శరత్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవి స్నేహానికి విలువిచ్చే మనిషి అని ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గొప్ప మనసు తాను కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైందని శరత్ కుమార్ తెలిపారు. గ్యాంగ్ లీడర్ మూవీలో నటిస్తున్న సమయంలో మీ తర్వాతి చిత్రాల్లో కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగేవాడిని. ఆయన ఏం అవసరం లేదురా నువ్వే హీరో అయిపోతావ్ చూడు అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే నేను హీరో అయ్యాను.
హీరోగా మంచి సినిమాలు చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి కెరీర్ డౌన్ అయింది. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ఓ పెద్ద నిర్మాత నా దగ్గరకు వచ్చి.. నీ ఆర్థిక సమస్యలు తీరేందుకు ఒక మార్గం ఉంది అని అన్నారు. నీకు చిరంజీవితో పరిచయం ఉంది కదా.. ఆయన దగ్గరికి వెళ్లి డేట్లు ఇమ్మని అడుగు. ఆయనతో సినిమాని నేను నిర్మిస్తాను. నీక్కూడా లాభాల్లో వాటా ఇస్తాను. తద్వారా నీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పారు.
నేను అడిగితే చిరంజీవి గారు డేట్లు ఇస్తారా అనే అనుమానం కలిగింది. వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి అన్నయ్య మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అడిగాను. విషయం ఏంటో చెప్పు అని అన్నారు. ఫోన్లో చెప్పేది కాదు డైరెక్ట్ గా వచ్చి మీట్ అయి చెబుతాను అని చెప్పాను. సరే రమ్మని పిలిచారు.
చిరంజీవిని కలవడానికి హైదరాబాద్ వెళ్లాను. ఆ టైంలో ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నేను వెళ్ళిన వెంటనే డైరెక్టర్ కి చెప్పి షూటింగ్ ఆపేశారు.శరత్ కుమార్ వచ్చారు.. ఇక ఇవాళ షూటింగ్ క్యాన్సిల్.. రేపు చేద్దాం అని డైరెక్టర్ కి చెప్పారు. ఎంతో ఆప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అప్పుడే చిరంజీవికి నా ఆర్థిక సమస్యల గురించి చెప్పాను. మీరు డేట్లు ఇస్తే ఓ నిర్మాత సినిమా చేస్తానని అంటున్నారు. మీరు ఒప్పుకుంటే నాకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పాను.
చిరంజీవి గారు వెంటనే సరే అలాగే చేద్దాం. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే నీ సినిమాకి డేట్లు ఇస్తాను అని అన్నారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అని అడిగాను. చిరంజీవి గారు వెంటనే.. ఏంటి నువ్వే ఇబ్బందుల్లో ఉన్నానంటున్నావ్ నువ్వు నాకు రెమ్యునరేషన్ ఇస్తావా.. ఏం అవసరం లేదు. ఈ సినిమా నీకోసం నేను చేస్తాను అని అన్నారు. నీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం మాత్రమే కాదు.. నటుడిగా నీకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పారు.
రెమ్యునరేషన్ తీసుకోకుండా తనకోసం సినిమా చేస్తానని చిరంజీవి గారు అన్నప్పుడు తాను ఎంతో ఎమోషనల్ అయ్యానని.. స్నేహం విలువ అప్పుడు తెలిసిందని శరత్ కుమార్ అన్నారు. అయితే ఆ చిత్రం ప్రారంభం కావడానికి అంటే ముందే నాకు హీరోగా మంచి అవకాశాలు వచ్చాయి. చిరంజీవితో సినిమా చేయకుండానే నా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి అని శరత్ కుమార్ తెలిపారు.