పెళ్ళి తర్వాత నిహారికా-చైతన్యల ఫస్ట్ ఫోటో.. వాహ్ అనాల్సిందే!
First Published Dec 10, 2020, 3:52 PM IST
మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారి వివాహం చైతన్యతో బుధవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కి చెందిన ఉదయ్ ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఈవెంట్ తరహాలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, బంధుమిత్రులు కొద్ది మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తాజాగా నిహారికా, చైతన్య ఫస్ట్ ఫోటోకి పోజిచ్చారు.
కనీవినీ ఎరుగని రీతిలో, అబ్బురపరిచేలా ఈ మెగా ఈవెంట్ జరిగింది. నిహారిక, చైతన్య ఎంతో సంతోషంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
తాజాగా పెళ్ళి తర్వాత నూతన వధువరులు ఓ ఫోటో దిగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హాతో కలిసి నిస్చే ఫోటోలకు పోజిచ్చారు.
కొత్త జోడీ వైట్ డ్రెస్సులో మెరిసిపోతున్నారు.
ఇద్దరిలోనూ పెళ్లితో వచ్చిన సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిహారికలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది.
మరోవైపు రాత్రి జరిగిన పెళ్ళి వేడుక సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, రామ్‌చరణ్, సాయితేజ్ వంటి వారంతా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.