MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్

Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్

Niharika: రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ జరిగిన దానికి మెగా డాటర్ నిహారిక బాగా హర్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 23 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
FilmFare
Image Credit : Instagram

FilmFare

నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా కమిటీ కుర్రవాళ్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదికపై ఈ మూవీ టీమ్ కి చేదు అనుభవం ఎదురైంది. దీంతో, నిహారిక సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసింది.

నిజానికి, ఈ కమిటీ కుర్రవాళ్లు సినిమాకు అవార్డుల పంట పండింది. కొచ్చిలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఈ సినిమా రెండు కీలక అవార్డులను కైవసం చేసుకుంది. డైరెక్టర్ యధు వంశీ కి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును గెలుచుకోగా, సందీప్ సరోజ్ ఉత్తమ తొలి నటుడు అవార్డును అందుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
22
నిహారిక అసహనం...
Image Credit : Asianet News

నిహారిక అసహనం...

అయితే.. అవార్డులు గెలుచుకున్నామన్న సంతోషం తమకు లభించలేదని నిహారిక అసహనం వ్యక్తం చేసింది. అవార్డులు ప్రధానం చేసినప్పటికీ, విజేతలకు కనీసం విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. తెలుగు వారికే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన కొత్త వారికి కూడా ఇలానే చేసినట్లు సమాచారం. దీంతో.. ఈ ఘటనపై నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించింది. ఈవెంట్ నిర్వహణ తీరుపై ఆమె మండిపడ్డారు.

"కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై నిలబడి మాట్లాడటం అనేది ఒక లాంఛనం కాదు, అది వారి జీవితకాల స్వప్నం" అని ఆమె పేర్కొన్నారు.పెద్ద ఈవెంట్లలో సమయ పరిమితులు ఉంటాయని అంగీకరిస్తూనే, "తొలిసారి అవార్డు గెలుచుకున్న వారి కోసం కనీసం ఒక నిమిషం కేటాయించినా వారిలో ఎంతో ఉత్సాహం నిండుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు. నిహారిక పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ విషయంపై నిర్వాహకులు స్పందించకపోవడం గమనార్హం.

Related Articles

Related image1
Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Related image2
Lavanya Tripathi Come Back: లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీ స్టార్ట్, ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన మెగా కోడలు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image2
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Recommended image3
సన్నగా ఉన్నా నటనలో సునామీ... 'కరుప్పు'లో సూర్యను డామినేట్‌ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Recommended image2
Lavanya Tripathi Come Back: లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీ స్టార్ట్, ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన మెగా కోడలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved