MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది

Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది

Food from Prabhas: ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త హీరోయిన్ ఇమాన్వికి అదే జరిగింది. ప్రభాస్ ఆతిథ్యాన్ని ఆమె చాలా సంతోషంగా స్వీకరించినట్టు సోషల్ మీడియాలో చెప్పింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 23 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రభాస్ ఇంటి నుంచే ఎందుకు?
Image Credit : actorPrabhas/Instagram

ప్రభాస్ ఇంటి నుంచే ఎందుకు?

ప్రభాస్ తో సినిమా అంటే సహనటులు, టెక్నీషియన్లు చిత్ర బృందమంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా పంపించిన వంటకాలు ప్రతిరోజు షూటింగ్ సెట్ కు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభాస్ కుటుంబం సంప్రదాయబద్ధంగా అతిథి సత్కారాలు చేస్తుంది. ఇంటికి వచ్చిన వారికి స్వయంగా వండి పెట్టడం, ఆహారం షేర్ చేసుకోవడం వారి సంస్కృతిలోనే భాగం. ప్రభాస్ కు కూడా ఆ అలవాటే వచ్చిందని ఆయన స్నేహితులు చెబుతూ ఉంటారు. సినిమా షూటింగ్ సమయంలో రుచికరమైన ఇంటి వంటతో అందరికీ ఉత్సాహం పెరుగుతుందని, అందుకే ప్రభాస్ ఇంటి నుంచి భోజనం ప్రత్యేకంగా వండించి పంపిస్తూ ఉంటారని సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు.

24
భీమవరం రాజు కదా
Image Credit : actorPrabhas/Instagram

భీమవరం రాజు కదా

ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందంటే తినడానికి పొట్ట,చూసేందుకు కళ్లు సరిపోవు. ఐదారుగురికి సరిపడినంత ఫుడ్డును ఒక మనిషికి కోపం పంపిస్తారు. అందులో బిర్యానీలు, పులావులు, రొయ్యలు, చేపలు, మటన్, చికెన్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. చూస్తేనే కడుపు నిండిపోతుంది. ప్రభాస్ తో నటించిన దాదాపు అందరూ ఆ ఫుడ్ ను రుచి చూసిన వారే. ప్రభాస్ ను భీమవరం రాజుగారు అంటారు. అందుకే చేపలు, రొయ్యల ప్రత్యేక వంటకాలు మెనూలో ముఖ్యంగా ఉంటాయి. గతంలో శ్రద్ధ కపూర్ తో సాహో సినిమాలో నటించాడు ప్రభాస్. ఆమెకు కూడా తన ఆతిథ్యాన్ని రుచి చూపించాడు ప్రభాస్.

Related Articles

Related image1
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Related image2
Cleaning Hacks: బకెట్, మగ్ పై ఉన్న మొండి మరకలు పోవాలంటే అద్భుతమైన చిట్కాలు
34
ఇమాన్వి కోసం ప్రత్యేక విందు
Image Credit : Imanvi1013/Instagram

ఇమాన్వి కోసం ప్రత్యేక విందు

ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తోంది. తొలిసారి ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఆమె గతంలోనే ప్రభాస్ ఆతిథ్యాన్ని పొందింది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతుండడంతో ఆమెను ఇంటికి పిలిచి మరీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు ప్రభాస్. ఆ విషయాన్ని అప్పట్లో సోషల్ మీడియాలో తెలియజేసింది ఇమాన్వి. తాజాగా మరొకసారి ప్రభాస్ ఇమాన్వికి మంచి ఫుడ్ ట్రీట్ ఇచ్చారు. ఆమె ఉంటున్న హోటల్ రూమ్ కి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను పంపించారు. ఆ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అన్ని వెరైటీస్ చూస్తే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే.

44
వరుస సినిమాల్లో బిజీ
Image Credit : Actorprabhas/Instagram

వరుస సినిమాల్లో బిజీ

ఇక ఫౌజీ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వి ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని ఆశపెట్టుకుంది. ఇప్పటివరకు కూడా ఫౌజీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. ఇదొక పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా అని చెబుతోంది మైత్రి మూవీ మేకర్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వారు కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. మధ్యలో ఫౌజీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image2
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Recommended image3
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Related Stories
Recommended image1
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Recommended image2
Cleaning Hacks: బకెట్, మగ్ పై ఉన్న మొండి మరకలు పోవాలంటే అద్భుతమైన చిట్కాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved