నయనతారకు మరో షాక్, 5 కోట్లు చెల్లించాలని నోటీసులు, కారణం ఇదే?
నయనతారకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నెట్ ఫ్లిక్స్ లో తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కేసు నడుస్తుండగానే.. మరో నోటీసులు అందుకున్నారు లేడీ సూపర్ స్టార్. ఇంతకీ విషయం ఏంటంటే?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది స్టార్ హీరోయిన్ నయనతార. స్టార్ హీరోలను మించిన క్రేజ్ తో దూసుకుపోతోంది నయనతార. 40 ఏళ్లు దాటిన తరువాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. స్టార్ ఇమేజ్ తో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది సీనియర్ బ్యూటీ. ప్రస్తుతం స్టార్ డమ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ల కంటే కూడా నయనతార ఎక్కువగా డిమాండ్ చేస్తోంది. ఒక్క సినిమాకు దాదాపు 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆమె తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక హిట్ సినిమాలు, స్టార్ డమ్, భారీగా ఆస్తులు మాత్రమే కాదు నయనతార కెరీర్ లో వివాదాలు, విషాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈమధ్య మరీ ఎక్కువగా వివాదాస్పదం అవుతోంది నయనతార. ముందు నుంచి అన్ని కోట్లు తీసుకుంటున్నా.. సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నయన్ ఎక్కడా కనిపించదు. ఈమధ్య కాలంలో స్టార్ హీరో ధనుష్ తో వివాదం ముదిరి పాకానపడి, కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే.
తన పెళ్లి వీడియో హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థకు ఇచ్చింది నయనతార. ఈ వీడియోను డాక్యుమెంటరీగా తయారు చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార తన భర్త విఘ్నేష్ దర్శత్వంలో నటించి మొదటి సినిమా నానూన్ రౌడీ దాన్ కు సబంధించిన సన్నివేశాలు కొన్ని వాడుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అందుకే ఆ సినిమా షూటింగ్ లోని కొన్ని సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు.
ఈసినిమాకు స్టార్ హీరో ధనుష్ నిర్మాత కావడం, ఆయన పర్మీషన్ లేకుండా ఆ సీన్ లు వాడుకోవడంతో ధనుష్ కోర్టు మెట్లెక్కారు. నయనతారకు 10 కోట్లు నష్టపరిహారం అడుగుతూ.. నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఈ కేసు కోర్డులో నడుస్తుండగానే నయనతారకు మరో షాక్ తగిలింది. ఇదే డాక్యుమెంటరీపై మరో నిర్మాణ సంస్థ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది. తమ సినిమాలోని సీన్స్ వాడుకున్నందుకు ఓ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ కేసు దాఖలు చేసింది.
‘నయనతార’ పెళ్లి డాక్యుమెంటరీలో రజనీకాంత్ జంటగా నటించి, నయన్ కు స్టార్ డమ్ తీసుకువచ్చిన చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. దీంతో ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్స్ సంస్థ నయనతారకు నోటీసు పంపింది.
తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించడం ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ధనుష్ నిర్మాణ సంస్థ నయనతారపై ఫిర్యాదు చేసినప్పుడు, ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్ పై ఫైర్ అయ్యింది, ఘాటుగా విమర్శించింది. మరి ఈ విషయంలో నయన్ ఎలా స్పందిస్తుంది, ఏం చేస్తుంది అనేది ఆసక్తి కరంగా మారింది.
ఇవే కాదు నయనతార మరికొన్ని వివాదాలు కూడా ఫేస్ చేసింది. దర్శకుడు విఘ్నేష్‌ను వివాహం చేసుకున్న తరువాత ఆమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. అప్పుడు ఆ విషయం కూడా వివాదం అయ్యింది. పర్మీషన్ లేకుండా ఆపని చేవారని వారిపై విమర్శలు వచ్చాయి.
కాని ఆ విషయంలో ఆమె తనను తాను నిరూపించుకుని బయటపడింది. అంతే కాదు రీసెంట్ గా నయనతార షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లిపై కామెంట్స్ చేయడంతో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటోందని ప్రచారం సాగింది. ఈ రూమర్లు కొనసాగుతుండగానే నయన తారకు ఈ 5 కోట్ల బిగ్ షాక్ తగిలింది.

