సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్, 100 కోట్ల ఇల్లు ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఒక్క సెకన్ కు 10 లక్షలు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.

ఒక సినిమాలో హీరోకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోతో పోల్చితే హీరోయిన్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. కాని ఈమధ్య హీరోయిన్లు కూడా ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు. హీరోయన్లు ఎంత డిమాండ్ చేసినా వారి పారితోషికం 50 కోట్లు దాటడం లేదు. కాని హీరోల రెమ్యునరేషన్ మాత్ర 300 కోట్లు దాటింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లు ఉండగా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి . నయనతార, సాయి పల్లవి, త్రిష లాంటి వారు అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. సినిమాలతో పాటు ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదిస్తున్నారు. సాయి పల్లవి మాత్రం ప్రకటనల్లో నటించకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు.
అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఇప్పటి వరకూ నయనతార ముందున్నారు. సినిమాలతో పాటు ప్రకటనలలో కూడా నటించి భారీ పారితోషికం అందుకున్నారు. 50 సెకన్ల నిడివి గల ఒక ప్రకటనలో నటించడం కోసం నయనతార దాదాపు 5 కోట్లు పారితోషికం తీసుకున్నారట.
ఆ ప్రకటనను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లోనూ చిత్రీకరించారట. అందుకే ఆ ప్రకటనకు 5 కోట్లు పారితోషికం అందుకున్నారు నయన్. అంటే సెకనుకి 10 లక్షల చోప్పుడు ఆమె రెమ్యునరేషన్ సంపాదించారన్నమాట.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన టాటా స్కై ప్రకటన కోసం ఈ భారీ పారితోషికం అందుకున్నారు. తమిళ సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్లకు పైగా అందుకుంటున్నారు. నయనతార చేతిలో ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాతో పాటు తమిళంలో హాయ్, రాక్కాయి, మూక్కుత్తి అమ్మన్ 2, మన్నాంగట్టి వంటి సినిమాలు ఉన్నాయి. మలయాళంలో నివిన్ పౌలీతో డియర్ స్టూడెంట్స్ సినిమా చేస్తున్నారు.
తమిళ సినిమాల్లో సొంత జెట్ విమానం ఉన్న ఏకైక హీరోయిన్ నయనతార. ఆమె జెట్ విమానం విలువ 50 కోట్లు ఉంటుందని అంచనా. రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్న నయనతార.. వివిధ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఆమెకు విలాసవంతమైన బంగ్లా ఉంది. దాని విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రాణిలా జీవిస్తున్న నయనతార ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

