- Home
- Entertainment
- నాగార్జునతో అస్సలు నటించను, తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరు, కారణం ఏంటి? నిజమెంత?
నాగార్జునతో అస్సలు నటించను, తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరు, కారణం ఏంటి? నిజమెంత?
కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో మన్మధుడని పేరు. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేసేవారు. కాని ఓ హీరోయిన్ మాత్రం నాగ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అంతే కాదు చేయనని తెగేసి చెపిందట కూడా. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా కథ? అందులో నిజమెంత?
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘కింగ్ నాగార్జున’. ఆయన కెరీర్‌లో దాదాపు టాప్ హీరోయిన్లు అందరితో స్క్రీన్‌షేర్ చేసుకున్నారు. రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా నుంచి శ్రీయా శరణ్, నయనతార వరకు అందరూ నాగార్జునతో జతకట్టినవారే. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఎప్పటికీ నాగార్జునతో సినిమా చేయను అని చెప్పేసిందట. అంతే కాదు ఇంత వరకూ నాగ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు ఆ హీరోయన్. ఆమె ఎవరో కాదు రంభ. ఇంతకీ రంభ నాగార్జునతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి? నిజమెంత?
1990లలో టాలీవుడ్‌ను ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. స్క్రీన్ నేమ్ రంభ అని మార్చేుసుకున్న ఈ హీరోయిన్ ఈ పేరుతో బోలెడన్ని హిట్స్ ఇచ్చింది. 1992లో రాజేంద్ర ప్రసాద్ జోడీగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హలో బ్రదర్’ టైమ్ లో జరిగిన ఓ సంఘటన వల్ల రంభ నాగార్జునతో సినిమాలు చేయను అనేసిందట.
ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, ‘హలో బ్రదర్’ సినిమాలో ఈవీవీ మొదట రంభ, సౌందర్యల్ని హీరోయిన్లుగా ఎంపిక చేయాలనుకున్నారు. కానీ హీరో నాగార్జున మాత్రం రంభ స్థానంలో రమ్యకృష్ణను తీసుకోవాలని సలహా ఇచ్చారట. ఆయన సాధారణంగానే తన అభిప్రాయం వెల్లడించారట. అంతే కాదు రంభను ఉద్దేశించి ఆయన ఆ సలహా ఇవ్వలేదని సమాచారం. ఇక హీరో చెప్పడంతో దర్శకుడు రంభను తప్పించి రమ్యకృష్ణను ఆ ప్లేస్ లోకి తీసుకున్నారని సమాచారం. ఆ సమయంలో రంభ ఈ నిర్ణయాన్ని పట్ల గట్టిగానే స్పందించిందట.
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించగా, సౌందర్య, రమ్యకృష్ణ కెరీర్‌కు బిగ్ బ్రేక్‌గా నిలిచింది. అయితే ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు నాగార్జునపై రంభ అసంతృప్తిగా ఉండిపోయిందట. దీంతో ఆ తర్వాత ఆమె నాగార్జునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణించుకున్నట్టు సమాచారం. అందుకే ఆ తరువాత కాలంలో నాగార్జున హీరోగా రభంకు సినిమాల అవకాశాలు వచ్చినా.. ఆమె ఎటువంటి వివాదం లేకుండా ఆ ఆఫర్స్ ను సున్నితంగా తిరస్కరించిందని ఇండస్ట్రీ టాక్.
ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసే అవకాశం వచ్చినా నో చెప్పడమే కాదు కెరీర్ మొత్తంలో ఆయనతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట రంభ. ఈ విషయం అఫీషియల్ గా ఎవరు నిర్ధారించలేదు. కాని ఇండస్ట్రీలో ఒక రూమర్ గా మాత్రం తెగ హల్ చల్ చేసింది. ఇక రంభ తెలుగు, తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టింది.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మాత్రం తనను హాలో బ్రదర్ సినిమాలో ఎలాగైనా భాగం చేయాలని అనుకున్నారట. అందుకే ఈసినిమాలో రంభకు ఓ స్పెషల్ సాంగ్‌లో అవకాశం ఇచ్చాడు.
తనను సినిమా నుంచి తీసేసినా.. దర్శకుడిమీద గౌరవంతో రంభ ఈసినిమాలో సాంగ్ లో నటించడానికి ఒప్పుకుందంని అంటుంటారు. ఈ రకంగా రంభ హలో బ్రదర్ లో హీరోయిన్ గా నటించాల్సింది పోయి ‘కన్నె పెట్టరో’ పాటలో ఆమని, ఇంద్రజలలో ఒకరిగా నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసింది.
ఇక రంభ కెరీర్‌లో అల్లరి మొగుడు, బాషా, బావగారు బాగున్నార వంటి గుర్తుండిపోయే హిట్స్ సినిమాలు చేసింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది రంభ. ఆతరువాత ఓరెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది రంభ. ఆతరువాత స్క్రీన్ కు కంప్లీట్ గా దూరం అయ్యింది. ఇక త్వరలో రంభ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్త హల్ చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంతో చూడాలి.