MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది

The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ 24న ది పారడైజ్ విడుదల
Image Credit : Asianet News

సెప్టెంబర్ 24న ది పారడైజ్ విడుదల

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది పారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలు కూడా జరగనున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి స్పందన కనిపిస్తోంది. మొదటి నాలుగు రోజులకు కలిపి సుమారు 72 వేల టికెట్లు అమ్ముడైనట్లు సాక్‌నిల్క్ గణాంకాలు వెల్లడించాయి. బ్లాక్ సీట్లు కలిపితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన ప్రీ సేల్స్ రూ 7 కోట్లకు పైగా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ 103.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
Image Credit : others

రూ 103.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

ది పారడైజ్ ప్రపంచవ్యాప్తంగా రూ 103.75 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ హక్కుల ద్వారా జరిగిన బిజినెస్. ఈ లెక్కకు అనుగుణంగా సినిమా థియేటర్ల నుంచి రూ 103.75 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను రికవర్ చేయాలంటే వచ్చిన షేర్ ఆ మొత్తాన్ని దాటాల్సి ఉంటుంది. రూ 103.75 కోట్లకు పైగా షేర్ రావాలంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 200 కోట్ల గ్రాస్ దాటాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాకు రూ 200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా చెబుతున్నారు.

35
నాని గత సినిమాలతో పోలిస్తే భారీ టార్గెట్
Image Credit : YouTube

నాని గత సినిమాలతో పోలిస్తే భారీ టార్గెట్

ఈ టార్గెట్ నాని గత సినిమాల ప్రపంచవ్యాప్త వసూళ్ల కంటే ఎక్కువగా ఉంది. హిట్ ది థర్డ్ కేస్ సుమారు రూ 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించగా, దసరా సుమారు రూ 118.50 కోట్లు వసూలు చేసింది. సరిపోదా శనివారం సుమారు రూ 98.20 కోట్లు, హాయ్ నాన్న సుమారు రూ 76.35 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్‌తో తమ థియేట్రికల్ రన్ ముగించాయి. ఇండియా నెట్ వసూళ్లలో దసరా రూ 81.93 కోట్లతో ముందుండగా, హిట్ ది థర్డ్ కేస్ రూ 80.97 కోట్లతో ఉంది. అయితే ఓవర్సీస్ వసూళ్ల కారణంగా హిట్ ది థర్డ్ కేస్ వరల్డ్ వైడ్ గ్రాస్‌లో ముందుకు వెళ్లింది.

45
అడ్వాన్స్ బుకింగ్స్‌లో తొలిరోజుదే ఆధిపత్యం
Image Credit : Asianet News

అడ్వాన్స్ బుకింగ్స్‌లో తొలిరోజుదే ఆధిపత్యం

అడ్వాన్స్ బుకింగ్స్‌లో సెప్టెంబర్ 24 తొలి రోజుకు సంబంధించిన టికెట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రారంభ గణాంకాల ప్రకారం తొలి రోజు కోసం 58 వేల టికెట్లు వెయ్యికి పైగా షోలలో అమ్ముడయ్యాయి. బ్లాక్ సీట్లు మినహాయిస్తే గ్రాస్ సుమారు రూ 1.25 కోట్లు ఉండగా, బ్లాక్ సీట్లు కలిపితే ఈ మొత్తం సుమారు రూ 3.81 కోట్లకు చేరింది. నగరాల వారీగా హైదరాబాద్ ముందంజలో ఉంది. బ్లాక్ సీట్లు కలిపిన తొలి రోజు గ్రాస్‌లో హైదరాబాద్ సుమారు రూ 1.66 కోట్లు, బెంగళూరు రూ 33.58 లక్షలు, విజయవాడ రూ 15.61 లక్షలు, గుంటూరు రూ 12.72 లక్షలు నమోదు చేశాయి. ది ప్యారడైజ్ జోరు చూస్తుంటే తొలి రోజే ఈ సినిమాకు 60 కోట్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన పాజిటివ్ టాక్ వస్తే మూడు నాలుగు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి.

55
'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
Image Credit : Asianet News

'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

ది పారడైజ్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలుగా ఉంది. నాని సరసన కాయదు లోహర్ నటించగా, రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ, శోభన్ బాబు నుంచి సూర్యకాంతం వరకు, లెజెండ్స్ అంతా ఉన్నారు.. దర్శకుడే ఫ్లాప్ అన్నారు, కట్ చేస్తే
Recommended image2
Rukmini Vasanth: రుక్మిణి వసంత్‌కి తెలుగులో మరో బంపర్‌ ఆఫర్‌, నానితో రొమాన్స్.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Jailer 2 Team Remunerations: రజనీకాంత్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌.. మోహన్‌లాల్, శివన్న, రమ్యకృష్ణలకు ఎంతంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved