MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే

Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే

Top 5 Trending Folk Songs: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ట్రెండ్స్‌ను తెలుగు ఫోక్ సాంగ్స్ ఏలుతున్నాయి. క్యాచీ బీట్స్, గ్రామీణ నేటివిటీ, సూపర్ స్టెప్పులతో యూత్‌ను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రీల్స్‌లో రచ్చ లేపుతున్న ఫోక్ సాంగ్స్.. ఈ 5 పాటలు వింటే డాన్స్ చేయాల్సిందే!
Image Credit : Chatgpt

రీల్స్‌లో రచ్చ లేపుతున్న ఫోక్ సాంగ్స్.. ఈ 5 పాటలు వింటే డాన్స్ చేయాల్సిందే!

ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్స్ హవానే కనిపిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ వీడియోల్లో మన గ్రామీణ యాస, నాటు డప్పు బీట్స్ మారుమోగిపోతున్నాయి. పల్లెటూరి సహజత్వం, డీజే హుక్ స్టెప్పులతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రస్తుతం షేక్ చేస్తున్న ఆ టాప్ 5 వైరల్ ఫోక్ సాంగ్స్ వివరాలు మీకోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యేశనగుల కట్టమీద: గ్లోబల్ లెవెల్ మాస్ సెన్సేషన్
Image Credit : YouTube

యేశనగుల కట్టమీద: గ్లోబల్ లెవెల్ మాస్ సెన్సేషన్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాను అత్యధికంగా ఊపేసిన పాటల్లో ‘యేశనగుల కట్టమీద’ ముందు వరుసలో ఉంటుంది. నాని, కీర్తి సురేష్ నటించిన 'ది ప్యారడైజ్' సినిమాలోని ఈ పాట తెలంగాణ సంప్రదాయ నాటు జానపదం నుంచి పుట్టుకొచ్చింది. అనిరుధ్ రవిచందర్ బాస్ బీట్స్, కాసర్ల శ్యామ్ లిరిక్స్, అద్దుల జంగిరెడ్డి, ప్రభ గాత్రం ఈ పాటను గ్లోబల్ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటేసి, రీల్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

36
బాసింగ బాసింగ బలాలే: వివాహ వేడుకల డీజే ధమాకా
Image Credit : VEDHAS MUSIC/Youtube

బాసింగ బాసింగ బలాలే: వివాహ వేడుకల డీజే ధమాకా

పెళ్లిళ్ల సీజన్, హల్దీ వేడుకలు, కాలేజీ ఫంక్షన్లలో మార్మోగుతున్న మరో సూపర్ హిట్ ట్రాక్ ‘బాసింగ బాసింగ బలాలే’. కళ్యాణ్ కీస్ సంగీతంలో స్వామి నరేష్ దుబ్బ, శ్రీనిధి పాడిన ఈ పాటలో ఈశ్వర్ సాయి, వైష్ణవి సోనీ సందడి చేశారు. మన తెలుగు పెళ్లిళ్లలోని 'బాసింగం' సంప్రదాయం ఆధారంగా వచ్చిన ఈ క్యాచీ తీన్మార్ పాటపై లక్షలాది మంది డ్యాన్స్ రీల్స్ చేస్తున్నారు.

46
యెద్దులచ్చి ముద్దుపెట్టే: పల్లె ఆత్మీయతల పవర్ ఫుల్ బీట్
Image Credit : Youtube/AKN TUNES

యెద్దులచ్చి ముద్దుపెట్టే: పల్లె ఆత్మీయతల పవర్ ఫుల్ బీట్

ఇటీవలే విడుదలై నెటిజన్ల మనసు దోచుకుంటున్న కొత్త తెలంగాణ ఫోక్ సింగిల్ ‘యెద్దులచే ముద్దుపెట్టే’. ప్రముఖ జానపద గాయని చుంచు నాగవ్వ, సింగర్ ప్రభ పాడిన ఈ పాట గ్రామీణ వాతావరణం, పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. డప్పు బీట్‌తో కూడిన ఈ నాటు పాట యూట్యూబ్ షార్ట్స్‌లో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

56
బిందె మీద బిందె పెట్టి: డ్యాన్స్ కవర్స్‌కు కేరాఫ్ అడ్రస్
Image Credit : Youtube/VAIDIKA MUSIC

బిందె మీద బిందె పెట్టి: డ్యాన్స్ కవర్స్‌కు కేరాఫ్ అడ్రస్

పల్లెటూరి పిల్లల అల్లరి, బావ-మరదళ్ల సంభాషణలతో రూపొందిన ‘బిందె మీద బిందె పెట్టి’ పాట రీల్స్ కింగ్ గా మారింది. సాండి సంగీతంలో తిరుపతి సాహో సాహిత్యం అందించగా, నాగవ్వ, శ్రీనిధి ఆలపించారు. ఈ పాటలోని హుక్ లైన్స్, డిజే వెర్షన్స్ రీల్స్ క్రియేటర్లకు బాగా నచ్చడంతో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.

66
ప్రమీల: డైలాగ్ స్టైల్ ట్రెండింగ్ ట్రాక్
Image Credit : Youtube/Trishul Veena

ప్రమీల: డైలాగ్ స్టైల్ ట్రెండింగ్ ట్రాక్

గ్రామీణ ప్రేమకథ, కోపం, భావోద్వేగాల సంభాషణల శైలిలో సాగే ‘ప్రమీల’ పాట సోషల్ మీడియాలో మీమ్స్, డ్యాన్స్ క్లిప్‌లకు కేరాఫ్‌గా మారింది. మాధురీ రాథోడ్, ఈశ్వర్ సాయి, ఉష అక్కల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాటలోని నటన, జానపద బీట్ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల కొద్ది వ్యూస్ సాధిస్తూ టాప్ 5 లిస్టులో నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్ రైళ్ల మధ్య తేడాలు ఏంటి? బడ్జెట్ జర్నీకి ఏది బెస్ట్?
Recommended image2
Snake Village: మనుషులతో కలిసి తిరిగే నాగుపాములు.. భారత్‌లోని ఈ స్నేక్ విలేజ్ గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved