MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం

Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ హాస్పిటల్ లో ఉన్న సమయంలో స్టార్ హీరో ఒకరు హాస్పిటల్ బిల్ కట్టేశారట. ఆ విషయాన్ని కమెడియన్ కుమార్తె ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2026, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
AVS Daughter
Image Credit : Asianet News

AVS Daughter

టాలీవుడ్ లో గొప్ప కమెడియన్స్ లో ఏవీఎస్(ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) ఒకరు. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్వరంతో ఎన్నో సినిమాల్లో ఏవీఎస్ కడుపుబ్బా నవ్వించారు. 1993లో మిస్టర్ పెళ్ళాం మూవీతో ఏవీఎస్ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, యమలీల, మాయాబజార్, వినోదం, శ్రీమతి వెళ్లోస్తా, వెంకీ, మా అన్నయ్య, పెళ్లి సందడి లాంటి సినిమాల్లో తన హాస్యంతో నవ్వించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏవీఎస్ కి కాలేయ సమస్య
Image Credit : Asianet News

ఏవీఎస్ కి కాలేయ సమస్య

ఏవీఎస్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా రాణించారు. అయితే ఏవీఎస్ 2008లో తీవ్రమైన కాలేయ సమస్యలతో బాధపడ్డారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. కానీ అది చాలా కాంప్లికేటెడ్. వైద్యులు కుటుంబసభ్యుల నుంచి కాలేయం తీసుకుని ఏవీఎస్ కి ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని ప్రయత్నించారు.

35
డాక్టర్ వద్దు అన్నారు
Image Credit : Asianet News

డాక్టర్ వద్దు అన్నారు

కానీ ఆయన భార్య, కొడుకు కాలేయం కొన్ని సమస్యల వల్ల కుదర్లేదు. దీనితో ఆయన కూతురు శాంతి తండ్రి కోసం కాలేయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ విషయాలని శాంతి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. శాంతి మాట్లాడుతూ.. నేను ఆ సమయంలో చాలా చబ్బీగా ఉండేదానిని. నాకు ఫ్యాటీ లివర్ ఉంటుందేమో అనే సందేహంతో డాక్టర్ వద్దు అన్నారు. డోనర్ కోసం ప్రయత్నించండి అని చెప్పారు.

45
తండ్రి కోసం కూతురి కష్టం
Image Credit : Asianet News

తండ్రి కోసం కూతురి కష్టం

నాన్న కోసం ఏ ఛాన్స్ కూడా నేను వదులుకోదలుచుకోలేదు. సర్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఒక్కసారి టెస్టులు చేయండి.. అప్పటికీ నా లివర్ కుదరదు అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పా. నేను రిక్వస్ట్ చేయడంతో డాక్టర్ టెస్టులు చేశారు. ఉహించని విధంగా నాకు ఎలాంటి సమస్యలు లేదు.. నా లివర్ 100 పర్సెంట్ హెల్దీ గా ఉంది. దీనితో డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికి నాకు పెళ్లయింది. కావాలంటే నా భర్త, అత్త మామలు అభ్యంతరం చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా మీ నాన్నకు లివర్ ఇవ్వు అని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకుంటే నాకు ఆ పని సాధ్యం అయ్యేది కాదు.

55
ఆసుపత్రి బిల్లు కట్టిన స్టార్ హీరో
Image Credit : X/Janasena Party

ఆసుపత్రి బిల్లు కట్టిన స్టార్ హీరో

2008లోనే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి 65 లక్షలు ఖర్చయింది. అప్పటికి నాన్నగారు ఆర్థికంగా జస్ట్ ఓకే అనే పోసిషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకుని మురళి మోహన్ అంకుల్ ముందుకు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చి సపోర్ట్ చేశారు. నాన్నకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారితో మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి గారు హాస్పిటల్ కి వచ్చి గంటకు పైగా సమయం గడిపి హాస్పిటల్ బిల్ కోసం కొంత మొత్తం సాయం చేసి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నాన్నని చూసి మాకు చెప్పకుండానే హాస్పిటల్ బిల్ కొంత కట్టేసి వెళ్లిపోయారు అని శాంతి, ఆమె భర్త శ్రీనివాస్( చింటు) గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Team Remunerations: ప్యారడైజ్‌ మూవీ టీమ్‌ పారితోషికాలు.. నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంతంటే?
Recommended image2
Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?
Recommended image3
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Related Stories
Recommended image1
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved