MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?

Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?

Hanuman Ansh OTT : 'హనుమాన్ అంశ్' సినిమా ఓటీటీ రిలీజ్ గురించి నిర్మాత రాగిణి సోనా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఏ ఓటీటీలో వస్తుంది? నిజంగానే రూ.100 కోట్ల డీల్ జరిగిందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆమె క్లారిటీ ఇచ్చారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓటీటీ రిలీజ్‌కు 'హనుమాన్ అంశ్' రెడీ
Image Credit : X

ఓటీటీ రిలీజ్‌కు 'హనుమాన్ అంశ్' రెడీ

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఫైనల్‌గా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే?
Image Credit : Instagram

కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే?

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రోజుతో ఈ సినిమా థియేటర్లలో 48వ రోజుకు చేరుకుంది. దీంతో ఈ బ్లాక్‌బస్టర్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

36
రూ.100 కోట్ల డీల్ నిజమేనా?
Image Credit : Instagram

రూ.100 కోట్ల డీల్ నిజమేనా?

మొదట్లో ఓ పాపులర్ ఓటీటీ సంస్థ 'మాకు ఈ సాధువు కథ వద్దు' అని రిజెక్ట్ చేసిందట. కానీ ఇప్పుడు అదే సినిమాకు పలు ఓటీటీ సంస్థలు రూ.100 కోట్ల డీల్ ఆఫర్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నిర్మాత రాగిణి సోనా స్పందించారు.

46
ఏ ఓటీటీలో రాబోతోంది?
Image Credit : X

ఏ ఓటీటీలో రాబోతోంది?

"విశాల్ చతుర్వేది గారికి ఒక స్పష్టమైన విజన్ ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి కాబట్టి నేను ఆయన మాటను గౌరవిస్తాను. ఆయన ఇంకొన్నాళ్లు ఆగుదాం అంటున్నారు. మాకు ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి కానీ, ఇంకా రూ.100 కోట్ల ఆఫర్ అయితే రాలేదు. త్వరలోనే ఓటీటీ డీల్ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం" అని రాగిణి చెప్పారు.

56
థియేటర్లలోనే చూడాల్సిన సినిమా
Image Credit : twitter

థియేటర్లలోనే చూడాల్సిన సినిమా

ఈ సినిమాను థియేటర్లలోనే ఎందుకు చూడాలో రాగిణి వివరించారు. "పెద్ద తెరపై సినిమా చూడటం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఓటీటీలో అయితే ఇంట్లో కూర్చుని చూస్తాం. మధ్యలో కాలింగ్ బెల్ మోగడం, ఎవరో ఒకరు రావడం లాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు స్క్రీన్ మీద నుంచి కళ్లు తిప్పుకోలేరు" అని ఆమె అన్నారు.

66
అసలు ఈ సినిమా కథేంటి?
Image Credit : X

అసలు ఈ సినిమా కథేంటి?

'హనుమాన్ అంశ్' సినిమా నీమ్ కరోలీ బాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. స్వయంభు మీడియా నెట్‌వర్క్ బ్యానర్‌పై విశాల్ చతుర్వేది ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు. నీమ్ కరోలీ బాబా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఆయన రాసిన 'దివ్య యాత్ర: ది వన్ హూ చేంజ్డ్ మై లైఫ్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం
Recommended image3
Paradise Team Remunerations: ప్యారడైజ్‌ మూవీ టీమ్‌ పారితోషికాలు.. నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంతంటే?
Related Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved