- Home
- Entertainment
- ఇలాంటి హస్బెండ్ కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా.. సీనియర్ నటుడికి శ్రీముఖి ఫిదా, వైరల్ కామెంట్స్
ఇలాంటి హస్బెండ్ కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా.. సీనియర్ నటుడికి శ్రీముఖి ఫిదా, వైరల్ కామెంట్స్
టాలీవుడ్ క్రేజీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సుమ, అనసూయ తర్వాత శ్రీముఖి యాంకర్ గా అంతటి గుర్తింపు సొంతం చేసుకుంది. శ్రీముఖి అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూనే ఉంది.

టాలీవుడ్ క్రేజీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సుమ, అనసూయ తర్వాత శ్రీముఖి యాంకర్ గా అంతటి గుర్తింపు సొంతం చేసుకుంది. శ్రీముఖి అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూనే ఉంది. అయితే శ్రీముఖికి నటిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టేలా పాత్రలు దక్కడం లేదు. బుల్లితెరపై మాత్రం యాంకర్ గా దూసుకుపోతోంది.
పలు టీవీ ఛానల్స్ లో శ్రీముఖి చేస్తున్న షోలు బాగా పాపులర్ అయ్యాయి. జీ తెలుగు ఛానల్ లో శ్రీముఖి సరిగమప అనే సింగింగ్ షోకి యాంకర్ గా చేస్తోంది. చలాకీగా ఉంటూ తనదైన శైలిలో చిలిపిదనం ప్రదర్శిస్తూ, జోకులు వేస్తూ ఈ షోని శ్రీముఖి సరదాగా నడిపిస్తోంది.
ఈ షోలో సీనియర్ గాయని ఎస్పీ శైలజ, సంగీత దర్శకుడు కోటి లాంటివాళ్ళు అతిథులుగా పాల్గొంటున్నారు. ఓ ఎపిసోడ్ లో భాగంగా శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఓ ఎపిసోడ్ లో సంగీత దర్శకుడు కోటి, ఇతర అతిథులు జోడీలుగా వచ్చారు. కానీ ఎస్పీ శైలజ మాత్రం సింగిల్ గా వచ్చారు. దీనితో శ్రీముఖి మీరు కూడా మీ భర్తతో వచ్చి ఉండాల్సింది. కనీసం మీ భర్తతో ఫోన్ చేసి అయినా మాట్లాడండి అని శ్రీముఖి అడిగింది. దీంతో ఎస్పీ శైలజ వెంటనే తన భర్తకు ఫోన్ చేశారు. ఎస్పీ శైలజ భర్త సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ అనే సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఆయన నటుడిగా రాణిస్తున్నారు.
ఎస్పీ శైలజ ఫోన్ చేయగానే.. చెప్పు అమ్ములు అంటూ శుభలేఖ సుధాకర్ క్యూట్ గా పలకరించారు. ఏం లేదండి.. ఈ షోకి అందరూ జోడీలుగా వచ్చారు. కనీసం మీ భర్తతో ఫోన్లో అయినా మాట్లాడించండి అని శ్రీముఖి అడిగింది. అందుకే ఫోన్ చేశాను అని ఎస్పీ శైలజ అన్నారు. ఏం పర్వాలేదు మాట్లాడతాను అని సుధాకర్ సమాధానం ఇచ్చారు.
శ్రీముఖి వెంటనే ఫోన్ తీసుకొని సుధాకర్ సార్ అని పిలిచింది, ఆ చెప్పు నాన్న అని ఆయన బదులిచ్చారు.. ఇలాంటి హస్బెండ్ కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను అంటూ ఎమోషనల్ గా చెప్పింది. సుధాకర్ బదులిస్తూ నువ్వు అలా ఏడవకు నాన్న నేనేదో తప్పు చేశానని అనుకుంటారు అని ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
శ్రీముఖి మాట్లాడుతూ మీకు పెళ్ళై చాలా ఏళ్ళు గడిచింది. అయినప్పటికీ మీ భార్యని అమ్ములు బంగారం అని ఎంతో ప్రేమగా ముద్దుగా పిలుస్తున్నారు. మీ మధ్య ఉన్న ప్రేమకి ఇదే నిదర్శనం అని శ్రీముఖి తెలిపింది. సుధాకర్ రియాక్ట్ అవుతూ తను నిజంగానే బంగారం, కాబట్టే అలా పిలిచాను అని అన్నారు. ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్ క్యూట్ కాన్వర్జేషన్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది.

