మహేష్ బాబు హీరోయిన్ కి నమ్రత ఫిదా.. ఆ మూవీపై ఎలా ప్రశంసలు కురిపించిందో చూడండి
ప్రియాంక చోప్రా ప్రస్తుతం కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెకి హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెకి హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. ప్రియాంక చోప్రాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత తాజాగా ప్రశంసలు కురిపించారు.
ఇటీవల విడుదలైన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ "హెడ్స్ ఆఫ్ స్టేట్"లో జాన్ సీనా, ఇడ్రిస్ ఎల్బా వంటి ప్రముఖులతో కలిసి నటించిన ప్రియాంక నటనపై నమ్రత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు.
"నీవు అద్భుతంగా నటించావు ప్రియాంక చోప్రా. రాకింగ్ పెర్ఫార్మెన్స్ అందించావు. నీ నటన, హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ నాకు చాలా బాగా నచ్చాయి. దీనిని చూసిన ప్రియాంక చోప్రా కూడా వెంటనే స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నమ్రతకు ధన్యవాదాలు తెలిపారు.
వీళ్లిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్ కావడానికి కారణం ఉంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే, రాజమౌళి తెరకెక్కిస్తున్న‘SSMB29’ సినిమాలో ప్రియాంక ముఖ్య పాత్ర పోషించనున్నారు. బాహుబలి, RRR తర్వాత రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలని డిసైడ్ అయ్యారు. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామికి సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. గడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో అతి ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి కథను సిద్ధం చేశారు. త్వరలో మహేష్ బాబు, రాజమౌళి అండ్ టీం త్వరలో కెన్యాకు పయనం కాబోతున్నారు. కెన్యా అడవుల్లో కీలక షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.