'అఆ' తర్వాత నితిన్ చిత్రాల పరిస్థితి చూశారా.. 11 చిత్రాల్లో 10 ఫ్లాపులు..
యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం విచిత్రమైన దశలో ఉంది. నితిన్ కి ఇటీవల ఏ మాత్రం కలిసి రావడం లేదు. నితిన్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి.

యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం విచిత్రమైన దశలో ఉంది. నితిన్ కి ఇటీవల ఏ మాత్రం కలిసి రావడం లేదు. నితిన్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి. దర్శకులు తప్పు చేస్తున్నారో, కథలు ఎంచుకోవడంలో నితిన్ విఫలం చెందుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
నితిన్ లేటెస్ట్ గా నటించిన తమ్ముడు చిత్రం శుక్రవారం రోజు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కూడా క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఆడియన్స్ నుంచి కూడా మిక్స్డ్ టాక్ వస్తోంది. తమ్ముడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ నితిన్ కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. ఈ చిత్ర ఫలితాన్ని నితిన్ ముందే ఊహించినట్లు ఉన్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత నితిన్ లై నుంచి తమ్ముడు వరకు మొత్తం 11 చిత్రాల్లో నటించాడు. ఈ 11 చిత్రాల్లో 10 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది.
లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం, చెక్, మ్యాస్ట్రో, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో నితిన్ వెంటనే తన కెరీర్ ని సమీక్షించుకోవాలి అని విశ్లేషకులు, అభిమానులు కోరుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే కెరీర్ ప్రమాదంలో పడొచ్చు.
ఇలాంటి పరిస్థితి నుంచి బౌన్స్ బ్యాక్ కావడం నితిన్ కి కొత్త ఏమీ కాదు. గతంలో పదేళ్లపాటు నితిన్ కి ఒక్క హిట్ కూడా లేని దారుణమైన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి నితిన్ ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇష్క్ తర్వాత అఆ వరకు పరిస్థితి బాగానే కొనసాగింది. అఆ చిత్రం తర్వాత నితిన్ కి మళ్ళీ పరాజయాలు మొదలయ్యాయి. తమ్ముడు తర్వాత నితిన్ దిల్ రాజు నిర్మాణంలోనే మరో చిత్రం చేయబోతున్నారు. బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ అనే విలేజ్ డ్రామా చిత్రంలో నితిన్ నటించబోతున్నాడు. మరి ఈ చిత్రంతో అయినా నితిన్ పరిస్థితి మారుతుందేమో చూడాలి.