MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ గుడిలో జరిగిన సంఘటన వల్లే విజయనిర్మలని కృష్ణ పెళ్లి చేసుకున్నారా.. ఏం జరిగిందో తెలుసా ?

ఆ గుడిలో జరిగిన సంఘటన వల్లే విజయనిర్మలని కృష్ణ పెళ్లి చేసుకున్నారా.. ఏం జరిగిందో తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణ, లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మల గురించి పరిచయం అవసరం లేదు. కలిసి నటించిన వీళ్లిద్దరూ వివాహం చేసుకొని జీవితాన్ని కూడా కలిసి పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికర సంఘటన ఉందట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 04 2025, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram

సూపర్ స్టార్ కృష్ణ, లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మల గురించి పరిచయం అవసరం లేదు. కలిసి నటించిన వీళ్లిద్దరూ వివాహం చేసుకొని జీవితాన్ని కూడా కలిసి పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అంతకుముందే వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకుని ఉన్నారు. అయినప్పటికీ కృష్ణ విజయనిర్మల ప్రేమలో పడి వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికర సంఘటన ఉందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

సీనియర్ దర్శకుడు హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత విజయనిర్మలతో కలిసి సాక్షి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి బాపు దర్శకుడు. బాపు దర్శకత్వం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన చిత్రాల్లో సాంప్రదాయాలకు పెద్దపీట ఉంటుంది. అదే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి.

35
Image Credit : our own

సాక్షి చిత్రంలో క్లైమాక్స్ సాంగ్ ని  మీసాల కృష్ణుడు టెంపుల్ లో చిత్రీకరించారట. 'అమ్మ కడుపు చల్లన' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ఆ సాంగ్ లోనే కృష్ణ విజయనిర్మలకి పెళ్లి జరిగే సన్నివేశం ఉంటుంది. ఆ గుడిలో వీళ్ళిద్దరి పెళ్లి సన్నివేశాన్ని బాపు నిజమైన పెళ్లిలాగే సాంప్రదాయ బద్ధంగా జరిపించి చిత్రీకరించారట. అప్పటికి కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ, స్నేహం లేవు. పెళ్లి సీన్ చిత్రీకరణ తర్వాత అదే బట్టలతో కృష్ణ విజయనిర్మల గుడిలో నుంచి బయటకు వచ్చారట.

45
Image Credit : our own

దీంతో వాళ్ళిద్దరిని చూసి లెజెండ్రీ కమెడియన్ రాజబాబు ఒక జోస్యం చెప్పారు. ఈ గుడిలోకి జంటగా ఎవరు వచ్చినా వాళ్లు తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. మీరిద్దరూ జంటగా రావడం మాత్రమే కాదు.. పెళ్లి సీన్ లో నటించారు.. కాబట్టి మీ ఇద్దరికీ రియల్ లైఫ్ లో కూడా పెళ్లి జరగడం ఖాయం అని జోస్యం చెప్పారట. రాజబాబు మాటల్ని కృష్ణ, విజయనిర్మల అంతగా పట్టించుకోలేదు.

55
Image Credit : Asianet News

ఇది జరిగిన కొంతకాలానికే సూపర్ స్టార్ కృష్ణకి విజయనిర్మలపై ప్రేమ పెరిగింది. దీంతో కృష్ణ స్వయంగా విజయనిర్మలకి పెళ్లి విషయంలో ప్రపోజ్ చేశారు. విజయనిర్మలకు కూడా అప్పటికే కృష్ణ అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో వీళ్ళిద్దరూ 1969లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు అని హరిశ్చంద్ర రావు తెలిపారు.

కానీ పిల్లల విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణకి తన తొలి భార్య ఇందిరా దేవి ద్వారా అప్పటికే పిల్లలు ఉన్నారు. విజయనిర్మలకి కూడా తొలి వివాహంతో నరేష్ జన్మించాడు. దీంతో ఇక తమకు పిల్లలు అవసరం లేదని కృష్ణ, విజయనిర్మల నిర్ణయించుకున్నారట. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఇక విజయనిర్మల హీరోయిన్ గా రాణిస్తూనే 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్‌.. ఎలిమినేషన్‌ నుంచి జస్ట్ మిస్‌ ఎవరంటే?
Recommended image2
Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
తాను చేయాల్సిన మూవీలో చిరంజీవికి హీరోగా ఛాన్స్ ఇచ్చిన కమెడియన్, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా మారిందో తెలుసా
Recommended image2
హర్ష్ రోషన్ నటించిన ‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved