- Home
- Entertainment
- జపాన్ లో ప్రభాస్, అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన నాగార్జున, టాలీవుడ్ కింగ్ కు అక్కడ అంత క్రేజ్ ఉందా?
జపాన్ లో ప్రభాస్, అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన నాగార్జున, టాలీవుడ్ కింగ్ కు అక్కడ అంత క్రేజ్ ఉందా?
పాన్ఇండియాను షేక్ చేస్తున్న ప్రభాస్, ఎన్టీఆర్ లకు జపాన్ లో షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో యంగ్ స్టార్స్ కు పోటీ వస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో. ఇంతకీ విషయం ఏంటంటే?

టాలీవుడ్ హీరోలకు జపాన్ లో పెరుగుతున్న క్రేజ్
భారతీయ సినిమాల గ్లోబల్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత, జపాన్‌లో ఇండియన్ సినిమాలపై అభిమానులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల కోసం అక్కడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అక్కడ ఎక్కువగా క్రేజ్ ఉంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సాధించారు ప్రభాస్. ఇక జపాన్ లో ప్రభాస్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అక్కడ మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. అంతే కాదు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాతో అల్లు అర్జును అక్కడ రచ్చ రచ్చ చేశాడు. ఇలా తెలుగు హీరోలు జపాన్ లో తమ సత్తా చాటుతున్నారు. మార్కెట్ ను విస్తరిస్తున్నారు. ఈక్రమంలో మరోహీరో అక్కడ పాగా వేశాడు. అయితే ఆయన యంగ్ హీరో కాదు, టాలీవుడ్ సీనియర్ హీరో, మన్మధుడు నాగార్జునకు జపాన్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుసా?
జపాన్ లో నాగార్జున క్రేజ్
తాజాగా జపాన్‌లో తెలుగు నటుడు నాగార్జునకు ఏర్పడిన ఫ్యాన్ బేస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జపాన్ లో నాగార్జున క్రేజ్ ఎంత పెరిగిందంటే, తాజాగా ఆయన నటించిన ‘మనం’ సినిమా జపాన్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను ఆగస్టు 8న జపాన్‌లో రీ-రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రీ-రిలీజ్ సందర్భంగా జపాన్ అభిమానులతో నాగార్జున వర్చువల్ కాల్ ద్వారా మాట్లాడనున్నాడు. జూమ్ లేదా గూగుల్ మీట్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నాగార్జునకు జపాన్‌లో ఇంతటి ఆదరణ రావడానికి ప్రధాన కారణం “బ్రహ్మాస్త్ర” సినిమా. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అక్కడి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా 5 ఏళ్ల క్రితం రిలీజై అక్కడ మంచి విజయం సాధించింది. రణబీర్ కపూర్, అలియా భట్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో నాగార్జున పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీనితో ఆయనకి అక్కడ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
నాగార్జునకు కొత్త పేరు పెట్టిన జపాన్ ఆడియన్స్
ఇక రీసెంట్ గా నాగార్జున నటించిన “కుబేర” సినిమా కూడా జపాన్ ప్రేక్షకుల అభిమానం పొందింది అయితే ఈసినిమాను జపాన్ ప్రేక్షకులు ఓటీటీ ద్వారా చూశారు. అంతే కాదు నాగార్జునకు అక్కడ ఓ పేరు కూడా పెట్టారు అభిమానులు. కింగ్ సినిమాలను చూసిన జపాన్ అభిమానులు ఆయనకు “నాగ్ సామ” అపే పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ పేరుతో కామెంట్లు కూడా పెడుతున్నారు. జపనీస్ సంస్కృతిలో “సామ” అనే పదం దేవుళ్లు, రాజుల వంటి గౌరవనీయుల పేర్లకు జత చేస్తారు. ఇది నాగార్జునకు జపాన్‌లో ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది.
బాహుబలి తరువాత జపాన్ లో తెలుగు హీరోలకి పెరిగిన డిమాండ్
జపాన్ లో మన తెలుగు హీరోలకు మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ బాహుబలితో జపాన్ లో టాలీవుడ్ హీరోలకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రభాస్ తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలకు అక్కడ డిమాండ్ బాగా ఉంది. ఈక్రమంలో నాగార్జునకు ప్రస్తుతం ఈ రేంజ్లో క్రేజ్ పెరగడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు ఏ హీరోకు లేనట్టుగా నాగ్ కు ప్రత్యేకంగా పేరు కూడా పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక “మనం” సినిమా జపాన్‌లో తిరిగి విడుదల కానుండటంతో, ఈ క్రేజ్‌ను వినియోగించుకోవాలని మేకర్స్ నిర్ణయించారు. అభిమానులతో నేరుగా వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
タラクさんファンで能登、北陸で被害にあわれた方、
このメッセージどうか届いてほしい。
とても大きな力になると思う。
自分も住んでいた街が一瞬で地獄になった経験があります。
いま、どんな言葉をかけられても辛いと思いますが、あのタラクさんも心を寄せてくれています。明けない夜はない。 https://t.co/PgqoZC79HA— りゅうあん (@ryuan999) January 2, 2024
కూలీ సినిమాలో విలన్ గా కింగ్ నాగార్జున
ఇక మరోవైపు నాగార్జున నటించిన తాజా సినిమా “కూలీ” ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఆయన మాస్ యాక్షన్ పాత్రలో విలన్‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్‌ను గుర్తుచేస్తుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక రజినీకాంత్ తో పాటు నాగార్జున ఇద్దరికి జపాన్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. ఈ మల్టీ స్టారర్ సినిమాకు అక్కడ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా నాగార్జున పాన్ ఇండియా కాకుండా గ్లోబల్ స్టార్డమ్ వైపు దూసుకెళ్ళడంతో, జపాన్ మార్కెట్‌లో ఆయన క్రేజ్‌ను బట్టి, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు అక్కడ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.