- Home
- Entertainment
- 3000 కోట్లకు పైగా ఆస్తి, 100 సినిమాలు, 65 ఏళ్ల వయస్సులో యంగ్ స్టార్స్ కు చెమటలు పట్టిస్తున్న హీరో
3000 కోట్లకు పైగా ఆస్తి, 100 సినిమాలు, 65 ఏళ్ల వయస్సులో యంగ్ స్టార్స్ కు చెమటలు పట్టిస్తున్న హీరో
వారసుడిగా టాలీవుడ్ లోకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగిన సీనియర్ నటుడు, 90s లో దుమ్మురేపిన ఈ హీరో 100 సినిమాలు చేశాడు. రకరకాల వ్యాపారాలు చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు ప్రస్తుతం హిట్ సినిమాలు లేకున్నా స్టార్ డమ్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలు ప్లాప్ అయితే ఏముంది.. రియాల్టీ షోలు హోస్ట్ చేస్తూ.. సినిమాలు నిర్మిస్తూ, రకరకాల బిజినెస్ లు చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తున్నాడు ఓ హీరో. వేల కోట్ల ఆస్తులతో టాలీవుడ్ లోనే కాదు, నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున.
KNOW
65 ఏళ్ల వయసులో కూడా యంగ్ లుక్
టాలీవుడ్ లో దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ.. స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. నటుడిగా గట్టిన పేరు సంపాదించిన ఆయన, ప్రస్తుతం ఆర్థికంగా అత్యంత శక్తిమంతుడిగా గుర్తించబడుతున్నారు. 65 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ లుక్ లో మెరిసిపోతున్నాడు స్టార్ హీరో.
అక్కినేని నట వారసుడిగా
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 1986లో ‘విక్రమ్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున, అతి తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో పాటు ఆయన కూడా టాలీవుడ్‌ను శాసించిన నాలుగురు స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. వెండితెరపై వెలుగు తగ్గుతుండటంతో బుల్లితెరపై సందడి చేస్తున్నాడు నాగ్.
ఇండియాలోనే రిచ్ హీరోగా గుర్తింపు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, నాగార్జున నికర ఆస్తి విలువ సుమారు 3572 కోట్లు ($410 మిలియన్లు)గా ఉన్నట్టు సమాచారం. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 7300 కోట్ల తో ముందు ఉండగా..ఆ తర్వాత రెండవ స్థానంలో నాగార్జున నిలిచారు. నటుడిగా కాకుండా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, వేర్వేరు రంగాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.
కింగ్ నాగార్జున రెమ్యునరేషన్
నాగార్జున ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే కల్యాణ్ జ్యూవెల్లరీస్ వంటి బ్రాండ్ ఎండ్‌ఓర్స్మెంట్స్ తో పాటు కొన్ని వ్యాపారాలలో కూడా నాగార్జున పార్ట్నర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. వాటి ద్వారా ఆయన కోట్లలో సంపాదిస్తున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా నాగార్జున
సినిమాలు, వ్యాపారాలతో పాటు బుల్లితెరపై కూడా నాగార్జున సత్తా చాటారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోనుహోస్ట్ చేసిన నాగార్జున, ప్రస్తుతం "బిగ్ బాస్ తెలుగు" షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున గత సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకూ షోను నడిపారు. త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను కూడా ఆయనే హోస్ట్ చేయబోతున్నారు. దానికి సబంధించిన ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.