జపాన్ లో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
ప్రభాస్ కు ఇండియాతో పాటు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే జపాన్ లో ప్రభాస్ కంటే కూడా ఎక్కువ అభిమానులను సంపాధించుకున్న తెలుగు స్టార్ హీరో ఒకరున్నారని తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనలేదు. గ్లోబల్ ఇమేజ్ కలిగిన హీరో. బాహుబలి సినిమాతో టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సాధించారు ప్రభాస్.
బాహుబలి తరువాత పాన్ ఇండియా స్థాయిలో వరుసగా మూడు ప్లాప్ సినిమాలు వచ్చినా.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాచేయడం కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతూనే ఉన్నారు. పోటీపడుతూనే ఉన్నారు. ఇక ఇండియా లోనే కాకుండా ప్రభాస్ కు ఫారెన్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే.
జపాన్ లో ప్రభాస్ కు డై హార్ట్ ఫ్యాన్స్
బాహుబలి సినిమా ప్రభావం వల్ల చైనా, జపాన్ లాంటి దేశాల్లో రెబల్ స్టార్ కు డై హార్ట్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. మరీ ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ అంటే జపాన్ ఆడియన్స్ ఎంత ఇష్టం అంటే.. కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ను చూడటం కోసం చాలామంది తమ సొంత ఖర్చులతో ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అంతే కాదు బాహుబలి తరువాత జపాన్ లో ప్రభాస్ మ్యానియా గట్టిగా ప్రభావం చూపించింది. అక్కడి ఫ్యాషన్ లో కూడా ప్రభాస్ ను కలిపేశారు అభిమానులు. ప్రభాస్ చిన్న చిన్న కటౌట్లు, బాహుబలి డ్రెస్ లు, బాహుబలి బొమ్మలు ఇలా రకరకాలుగా తమ అభిమానం చాటుకున్నారు అక్కడి ప్రజలు.
రజినీకాంత్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్
అంతే కాదు ప్రభాస్ పేరు, ఫోటోలను టాటూలుగా వేయించుకున్న వారు కూడా ఉన్నారు. అంత అభిమానం అక్కడ ప్రభాస్ అంటే. బాహుబలికి ముందు అక్కడ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కలెక్షన్లు పరంగా కూడా రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా జపాన్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. కాని బాహుబలి వచ్చిన తరువాత ఆ రికార్డ్ లు అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ రజినీకాంత్ రికార్డ్ ను జపాన్ లో బ్రేక్ చేశారు.
ప్రభాస్ కు షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి చాలామంది పాన్ఇండియా స్టార్స్ బయటకు వచ్చారు. వారు కూడా విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగారు. పాన్ ఇండియా స్టార్స్ మాత్రమే కాదు తమిళసినీ పరిశ్రమ నుంచి సూర్య,కార్తి లాంటి హీరోలకు కు కూడా జపాన్ లో ప్రస్తుతం అభిమానులు తయారయ్యారు. కానీ క్రేజ్ ఎక్కువగా ఉన్న స్టార్స్ మాత్రం కొంత మంది మాత్రమే.
పాన్ ఇండియా స్టార్స్ గా అక్కడ ప్రభావం చూపించిన వారిలో ప్రభాస్ క్రేజ్ ను బీట్ చేసింది ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈసినిమాతో విదేశాల్లో కూడా తారక్ పేరు మారుమోగిపోయింది.
ఇటు జపాన్ లో కూడా ఈసినిమాకు భారీగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అయితే ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఎన్టీఆర్ సినిమాల కొన్ని జపాన్ ప్రజలు చూడటం, ఆతరువాత ఆర్ఆర్ఆర్ ద్వారా అక్కడివారికి తారక్ మరింత దగ్గరయ్యారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో భారీగా క్రేజ్ పెరిగిపోయింది.
జపాన్ లో దేవర సినిమా ప్రభావం
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ జపాన్ లో పెరగడంతో, తారక్ సినిమాల కోసం అక్కడి ప్రజలు ఎదురుచూశారు. ఈక్రమంలోనే మళ్లీ దేవర సినిమాతో దడదడలాడించాడు ఎన్టీఆర్. దేవర సినిమా ఇండియాలో 2024 లో రిలీజ్ అయితే.. జపాన్ లో మాత్రం ఈ ఏడాది అంటే 2025 మార్చ్ లో రిలీజ్ అయ్యింది.
దేవర సినిమాకు జపాన్ ప్రజలు జేజేలు కొట్టారు. అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది సినిమా. ఇలా ప్రభాస్ తో మొదలైన తెలుగు హీరోల క్రేజ్.. జపాన్ లో అలా కొనసాగుతోంది. ప్రస్తుతం మహే్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈసినిమా జాపాన్ లో రిలీజ్అయితే మహేష్ బాబును వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.