MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Durga Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ బోనాల పాట

Naga Durga Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ బోనాల పాట

Naga Durga Song: ఇడుపు కాయితం ఫేమ్ నాగదుర్గ నటించిన ‘నా పేరే ఎల్లమ్మ’ బోనాల సాంగ్ యూట్యూబ్‌లో వంద మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సూపర్ హిట్ సాంగ్ పూర్తి లిరిక్స్ మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఒక్క పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఇడుపుకాయితం హీరోయిన్.. ఎల్లమ్మ సాంగ్ లిరిక్స్ ఇవే
Image Credit : Youtube/JDL MUSIC

ఒక్క పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఇడుపుకాయితం హీరోయిన్.. ఎల్లమ్మ సాంగ్ లిరిక్స్ ఇవే

తెలంగాణ సంస్కృతికి, పండుగలకు బోనాలు ఎంతో ప్రత్యేకం. ఈ పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో బోనాల పాటలు మార్మోగిపోతుంటాయి. ఇప్పటికే విడుదలైన ఒక ఊరమాస్ సాంగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 'ఇడుపు కాయితం' ఫేమ్ నాగదుర్గ నటించిన "నా పేరే ఎల్లమ్మ" సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో, రీల్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వంద మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్‌లో రికార్డుల వేట
Image Credit : Youtube/JDL MUSIC

వంద మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్‌లో రికార్డుల వేట

ఈ ఊరమాస్ బోనాల స్పెషల్ సాంగ్ 2025 జూలై 4న ప్రీమియర్‌గా విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి ఈ సాంగ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ పాట ఏకంగా 114,777,860 వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. పెద్దలతో పాటు యువతకు సైతం ఈ సాంగ్ పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో ఈ పాట ఆడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నాగదుర్గ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

37
టాప్ టెక్నీషియన్స్ టీమ్ వర్క్
Image Credit : Youtube/JDL MUSIC

టాప్ టెక్నీషియన్స్ టీమ్ వర్క్

ఈ క్రేజీ సాంగ్‌ వెనుక ఒక పెద్ద టెక్నికల్ టీమ్ కష్టం ఉంది. ఈ పాటను దర్గుపల్లి ప్రభాకర్ నిర్మించారు. ఇన్‌స్టాలో ఫేమస్ అయిన 'కొరంటి మధు అమ్మ' నుంచి ఈ ట్యూన్ సోర్స్‌ను తీసుకున్నారు. ఈ పాటకు రాజేందర్ కొండ అద్భుతమైన లిరిక్స్ అందించగా, సింగర్ ప్రభా తన వాయిస్‌తో పూనకాలు తెప్పించారు. మదీన్ ఎస్కే అదిరిపోయే మ్యూజిక్ అందించారు. డిజె లింగా మిక్సింగ్ బాధ్యతలు చూసుకున్నారు.

47
విజువల్స్ అండ్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్
Image Credit : Youtube/JDL MUSIC

విజువల్స్ అండ్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్

ఈ సాంగ్ విజువల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా ఉంది. కమ్లీ పటేల్ డీఓపీగా వ్యవహరించగా, రెండో కెమెరాను డీజే సురేష్ హ్యాండిల్ చేశారు. శేఖర్ వైరస్ మాస్ స్టెప్పులతో కొరియోగ్రఫీ అదరగొట్టారు. అజయ్ కోడమ్ ఎడిటింగ్, డీఐతో పాటు టెక్నికల్ సపోర్ట్ అందించారు. భరత్ ప్రొడక్షన్ కంట్రోలర్‌గా, సాగర్ ముదిరాజ్ పోస్టర్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి మహేష్ పెగ్గర్ల మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ టీమ్ వర్క్ వల్లే 'నా పేరే ఎల్లమ్మ' సాంగ్ ఇప్పుడు ప్రతి ఇంటా మార్మోగుతోంది.

57
నాగదుర్గ “నా పేరే ఎల్లమ్మ సాంగ్” పూర్తి లిరిక్స్ ఇవిగో
Image Credit : Youtube/JDL MUSIC

నాగదుర్గ “నా పేరే ఎల్లమ్మ సాంగ్” పూర్తి లిరిక్స్ ఇవిగో

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో నేను

అందరి ముంగాట నే అమ్మవారునే

కల్యూగములోన కన్నే మారతానంటిరే

ఎయ్యో యాపశెట్టంటేనే ఇంపుగాయెనే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే

ని ఇంటి ముంగాట నే సుట్టామైతినే

ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే

నన్ను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే

అయ్యొ కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే

నన్ను అడిగినోళ్లకి ఆడ బిడ్డలిద్దునే

67
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో
Image Credit : Youtube/JDL MUSIC

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

అ మర్రి సెట్లల్లా నే మావురాలినే

ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే

సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే

ఆ గట్టు మీదున్న…గౌండ్లాడి బిడ్డనే

ఆ మంద్దొడ్డ కు నేను మారెమ్మ తల్లినే

ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

తీరొక్క పేరు నాది తీరు బండారు

తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు

77
అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు
Image Credit : Youtube/JDL MUSIC

అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు

అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు

అడ్డెడు బియ్యమ్ము నా ముంగట వొద్దురు

గా యాపరిల్లాలనే నాకు తోరణమిద్దురు

గా యటా పిల్లలనే నాకు కనుకగిద్దురు

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే

ఆ సీరే బట్టలనే నాకు సరే వోద్దురే

నా అక్క సెల్లెల్లె నాకు పాటలు వాడుదురే

నా అకిట్ల అలికి….బోట్ల పట్నాలేద్దురే

అమ్మ షేరను శెరనంటూ మాట సగాధిద్దురే

తల్లి శెరణాలే అంటూ…నన్ను ఆరాధిద్దు రే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Related Stories
Recommended image1
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !
Recommended image2
Samsung Galaxy Glasses: ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved